విద్యార్ధిని చితకబాదిన టీచర్

Student

మన తెలంగాణ/బోనకల్ : మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతీబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ పాఠశాలలో చదువుకొంటున్న విద్యార్ధి గోపిని గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్న అశోక్ శనివారం తీవ్రంగా కొట్టడంతో విద్యార్ధి సృహతప్పి పడిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్ధి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం గోపి అనే 10వ తరగతి చదివే విద్యార్ధి శనివారం రాత్రి సమయంలో పాఠశాలలో తాగునీరు కోసం గది నుండి బయటకు వచ్చాడు. ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న గెస్ట్ టీచర్ అశోక్ విద్యార్ధిని ఎటువంటి కారణం లేకుం డా కర్రతో కడుపుతో పొడిచాడు. తీవ్రంగాకొట్టాడు. దీంతో విద్యార్ధి సృహ తప్పాడు, భయపడిన అశోక్ విద్యార్ధిని 108వాహనం ద్వారా ఖమ్మం తరలించి వైద్యం చేయించారు.

ఆ తరువాత సమాచారం తెలుసుకొన్న ప్రిన్సిపాల్ అంజలి విషయాన్ని ఆలశ్యంగా విద్యార్ధి తల్లిదండ్రులకు తెలపగా వారు వచ్చి తమ కుమారుడి పరిస్తితి చూపి కన్నీటి పర్యంతమయ్యా రు. దీంతో విద్యార్ధి బంధువులు బోనకల్ వచ్చి పాఠశాలలో ప్రిన్పిపాల్ కోసం వాకబుచేయగా ఆమె అందుబాటులో లేకపోవటంతో తమ కుమారుడిని టీచర్ ఎందుకు కొట్టాడో తెలుసుకొనే ప్రయత్నం చేయగా వీరి రాకను గమనించిన టీచర్ అశోక్ పరారయ్యాడు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్న లలిత సరైన సమాధానం ఇవ్వకపోవటంతో వారు పాఠశాల ఆవరణలో ఆందోళన చేశారు. అనంతరం పోలీసుకు ఫిర్యాదు చేశారు.

teacher hitting student

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యార్ధిని చితకబాదిన టీచర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.