టిసిఎస్ లాభం 8,131 కోట్లు…

  క్యూ1లో విశ్లేషకుల అంచనాలను అందుకున్న కంపెనీ కంపెనీ ఆదాయం రూ. 38,172 కోట్లు ముంబై : ఐటి సేవల దిగ్గజం టిసిఎస్(టాటా క న్సల్టెన్సీ సర్వీసెస్) క్యూ1(ఏప్రిల్ -జూన్) ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అందుకుంది. మంగళవారం మార్కెట్ ముగిసిన అనంతరం టిసిఎస్ 2019 తొలి త్రైమాసిక ఫలితాలు (క్యూ1) ఫలితాలను వెల్లడించింది. సంస్థ నికర లాభం రూ.8,131 కోట్లతో 10.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది మిగతా భాగం మొత్తం రెండంకెల వృద్ధిపైనే దృష్టి […] The post టిసిఎస్ లాభం 8,131 కోట్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్యూ1లో విశ్లేషకుల అంచనాలను అందుకున్న కంపెనీ
కంపెనీ ఆదాయం రూ. 38,172 కోట్లు

ముంబై : ఐటి సేవల దిగ్గజం టిసిఎస్(టాటా క న్సల్టెన్సీ సర్వీసెస్) క్యూ1(ఏప్రిల్ -జూన్) ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అందుకుంది. మంగళవారం మార్కెట్ ముగిసిన అనంతరం టిసిఎస్ 2019 తొలి త్రైమాసిక ఫలితాలు (క్యూ1) ఫలితాలను వెల్లడించింది. సంస్థ నికర లాభం రూ.8,131 కోట్లతో 10.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది మిగతా భాగం మొత్తం రెండంకెల వృద్ధిపైనే దృష్టి పెట్టనున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ గోపీనాథ్ పేర్కొన్నారు.

గతేడాది సంస్థ నికర లాభం రూ.7,340 కోట్లతో పోలిస్తే ఈసారి మెరుగైన లాభాలొచ్చాయి. ఇంతకుముందు త్రై మాసికంలో(201819 క్యూ4)లో సంస్థ లా భం రూ.8126 కోట్లతో పోలిస్తే ఈసారి స్వ ల్పంగా పెరిగింది. ఆదాయం 11.4 శాతం వృద్ధి చెందింది. కంపెనీ ఆదాయం రూ.38,172 కో ట్లను నమోదు చేసింది. ఎబిటా మార్జిన్లు రూ. 9,220 కోట్లుగా నమోదయ్యాయి. అయితే డాలర్ ఆదాయంలో బలహీనపడింది. ముంబై లో మంగళవారం ముగిసిన బోర్డు మీటింగ్‌లో రూ.5 ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించేందుకు ప్రతిపాదించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని స్థిరంగానే కొనసాగించామని, బుక్ ఆర్డర్ పటిష్టంగా ఉందని గోపీనాథన్ తెలిపారు.

భారీగా నియామకాలు

2019 తొలి త్రైమాసికంలో నియామకాలు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారీగా చేపట్టినట్టు సంస్థ వెల్లడించింది. క్యూ1లో 12,356 మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నామని గోపీనాథన్ తెలిపారు. 30వేల మం ది నూతన గ్రాడ్యుయేట్లకు జాయినింగ్ లెటర్‌లను పంపామని అన్నారు. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,36,641కు చేరింది. మరోవైపు ఒక్కో షేరుకు రూ.5 డివిడెండ్‌ను ప్రకటిచింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టిసిఎస్ షేరు ధర 2%నికి పైగా త గ్గుదలతో రూ.2,131.45 వద్ద ముగిసింది.

TCS Profits Soared

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిసిఎస్ లాభం 8,131 కోట్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.