ప్రపంచంలో నాలుగోవంతు జనాభాకు టిబి ముప్పు

TB-Patients

లండన్ :ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది క్షయ (ట్యుబెర్‌క్యులోసిస్) వ్యాధి ప్రమాదంలో ఉంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరిని ఈ వ్యాధి పీడిస్తోంది. మైకోబాక్టీరియమ్ ట్యుబెర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే ఈ వ్యాధి ఏటా పది మిలియన్ కన్నా ఎక్కువ మందికి వ్యాపించి వారిలో రెండు మిలియన్ మందిని చంపుతోందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ప్రాణాంతకంగా తయారైన ఈ వ్యాధిపై అధ్యయనంలో 3,51,811మందిని పరీక్షించగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్షాలను సాధించడం చాలా కష్టమన్న అభిప్రాయం స్పష్టమైంది. 2035 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్షం. బయటపడని క్షయను సరిగ్గా చికిత్స చేస్తే కానీ పూర్తిగా లక్ష్యాన్ని సాధించలేమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోగుల్లో ప్రారంభ దశలో దీన్ని గుర్తించక పోతే తరువాత ఇది వారి పాలిట ప్రాణాంతకమవుతుందని అంటువ్యాధల స్పెషలిస్టు క్రిస్టియన్ వెజ్‌సే హెచ్చరించారు. డెన్మార్క్ ఆర్హస్ యూనివర్శిటీ ఆస్పత్రి స్పెషలిస్టుగా, యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా క్రిస్టియన్ వెజెస్ పనిచేస్తున్నారు.

36 దేశాలకు చెందిన 88 శాస్త్రీయ అధ్యయనాలను డెన్మార్క్, స్వీడన్ పరిశోధకులు సమీక్షించారు. గుప్త దశలో ఉన్న క్షయను చికిత్స చేయడం తప్పనిసరి అని గుర్తించారు. ప్రపంచ మొత్తం జనాభాలో ఐదోవంతు లేదా నాలుగోవంతు మందిని గుప్త క్షయ పీడిస్తోందని అధ్యయనం వెల్లడించింది. ఇదివరకటి కన్నా తక్కువ గానే ఉందని అనుకుంటున్నా దీని ఉనికి ప్రపంచంలో ఈనాడు చెప్పుకోతగినంత స్థాయిలో ఉందని ఆర్హస్ యూనివర్శిటీ ప్రకటించింది. మిలియన్ల కొలది క్షయ రోగులు ముఖ్యంగా పేద దేశాల్లో ఈ వ్యాధిని గుర్తించడం, వైద్య చికిత్స అందించడం సరిగ్గా జరగడం లేదు. అందుకని వ్యాధి నివారణకు ప్రపంచం లోని అన్ని దేశాలు నివాఱకు పెద్ద ఎత్తున చర్యలు చేపడితేనే కానీ అనుకున్న లక్షం నెరవేరదని అధ్యయనం సూచించింది. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ఈ అధ్యయనం వెలువడింది.

TB Infected People fourth of the world population

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రపంచంలో నాలుగోవంతు జనాభాకు టిబి ముప్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.