పాక్ మాజీ క్రికెటర్‌కు కరోనా వైరస్

Taufeeq Umar was infected with the corona virus

 

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఓపెనర్ తౌఫీక్ ఉమర్‌కు కరోనా వైరస్ సోకింది. శనివారం రాత్రి ఆయనకు వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ..“ నిన్న రాత్రి కొద్దిగా అనారోగ్యంగా ఉండటంతో రాత్రే కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నా. పరీక్షల్లో వైరస్ సోకినట్లు వెల్లడైంది. అయితే నాలో వైరస్ లక్షణాలు పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం మా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నాను. నేను త్వరగా కోలుకోవటానికి ప్రార్థనలు చేయండని అందరినీ కోరుతున్నాను” అని పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు ఉమర్‌తో కలిపి మొత్తం నలుగురు క్రికెటర్లకు వైరస్ సోకింది. మజిద్ హక్(స్కాట్‌లాండ్), జఫర్ సర్ప్‌రాజ్(పాకిస్తాన్), సోలో నక్వెనీ(సౌత్ ఆఫ్రికా)లకు కరోనా పాజిటివ్ వచ్చింది. పాకిస్తాన్ తరఫున 44 టెస్టుల, 12 వన్డేలను ఉమర్ ఆడాడు. 2014లో దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ఉమర్‌కు పాక్ తరఫున చివరిది.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాక్ మాజీ క్రికెటర్‌కు కరోనా వైరస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.