అవసరమైతే ప్లాంట్ మూసేస్తాం: టాటా మోటార్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే మహారాష్ట్రలోని ప్లాంట్‌లో వాహనాల తయారీ కార్యకలాపాలను తగ్గించినట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండి గ్వెటర్ బషెక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.‘ దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కార్యాలయాల్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. కరోనా వైరస్ ప్రభావం మరింత తీవ్రమైతే మంగళవారంనుంచి ప్లాంట్ కార్యకలాపాలను ఆపేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన ఆ […] The post అవసరమైతే ప్లాంట్ మూసేస్తాం: టాటా మోటార్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే మహారాష్ట్రలోని ప్లాంట్‌లో వాహనాల తయారీ కార్యకలాపాలను తగ్గించినట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండి గ్వెటర్ బషెక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.‘ దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కార్యాలయాల్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. కరోనా వైరస్ ప్రభావం మరింత తీవ్రమైతే మంగళవారంనుంచి ప్లాంట్ కార్యకలాపాలను ఆపేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

టాటా మోటార్స్ దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ అన్న విషయం తెలిసిందే. హారాష్ట్రలోని పుణెలో ఉన్న తయారీ కేంద్రం ఈ సంస్థకు కీలకం. ఎక్కువగా ట్రక్కులు, కార్ల తయారీకి సంబంధించిన కార్యకలాపాలు ఇక్కడే నిర్వహిస్తారు. మరోవైపు కరోనా వైరస్ కారణంగా ప్లాంట్ మూసివేత, లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగులు విధులు హాజరు కానప్పటికీ వారికి మార్చి, ఏప్రిల్ నెల జీతాలు చెల్లిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ విడిగా మరో ప్రకటనలో తెలిపారు.అదే విధాంగా టాటాకు చెందిన జాగ్వార్, లాండ్ రోవర్ కూడా బ్రిటన్‌లో తమ కార్యకలాపాలను నిలిపి వేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. వచ్చే వారంనుంచి ఏప్రిల్ 20 వరకు ఉత్పత్తి నిలిపి వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

Tata Motors announce a plant lockdown

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అవసరమైతే ప్లాంట్ మూసేస్తాం: టాటా మోటార్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: