వ్యభిచార గృహంపై పోలీసుల దాడి…

Task Force Police Rides on Prostitution Home

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని పాతబజార్‌లో స్థానికుల సమాచారం మేరకు ఒక అద్దె ఇంటిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతోపాటు విటుడుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. నిందితులు గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సిఐ ఎస్‌ శ్రీనివాసరావు, సిఐ మాధవి, ఎస్‌ఐ రమేశ్‌, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.