బెట్టింగ్ రాయుళ్లపై పోలీసుల ఉక్కుపాదం

  13మంది అరెస్ట్, ప్రధాన బుకీల కోసం టాస్క్‌ఫోర్స్ బృందాల గాలింపు మరో 20మంది యువకులకు పోలీసుల కౌన్సెలింగ్ వివరాలు వెల్లడించిన రామగుండం కమిషనర్ మంచిర్యాల అర్బన్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తు అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై ఉక్కు పాదం మోపుతామని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో బెట్టింగ్ రాయుళ్ళ వివరాలను సిపి వెల్లడించారు. ఈ సందర్బంగా బెట్టింగ్ పాల్పడిన యువకుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం […] The post బెట్టింగ్ రాయుళ్లపై పోలీసుల ఉక్కుపాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

13మంది అరెస్ట్, ప్రధాన బుకీల కోసం టాస్క్‌ఫోర్స్ బృందాల గాలింపు
మరో 20మంది యువకులకు పోలీసుల కౌన్సెలింగ్
వివరాలు వెల్లడించిన రామగుండం కమిషనర్

మంచిర్యాల అర్బన్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తు అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై ఉక్కు పాదం మోపుతామని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో బెట్టింగ్ రాయుళ్ళ వివరాలను సిపి వెల్లడించారు. ఈ సందర్బంగా బెట్టింగ్ పాల్పడిన యువకుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో రామగుండం టాస్క్‌ఫార్స్ పోలీసులు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్ రాయుళ్ళను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు ల్యాప్‌టాప్‌లు, 20సెల్‌పోన్లు, రూ, 1లక్ష8వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన బుకీలయిన జాజు సుమిత్, ఇనని శ్యాంలు పరారిలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.

అత్యాశకు పోయి బెట్టింగ్‌లకు పాల్పడి మోసపోవద్దని జాగ్రతగా ఉండాలన్నారు. బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలవుతు కుటుంబాలను రోడ్డున పడవేసుకోవద్దని హితవు పలికారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భూ మాఫియా, కలప స్మగ్లర్లు, వన్యప్రాణి వేటగాళ్ళు, పిడిఎస్ రైస్, చీటింగ్‌లకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామన్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడాన్ని ఆయన అభినందించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపట్టారన్నారు.

నిందితుల వివరాలు..
కాసు ప్రవీణ్, (లక్షెట్టిపేట) కట్ట సంతోష్ (దండెపల్లి), బొలిశెట్టి శ్రీధర్ (లక్షెట్టిపేట్), మల్యాల శివకుమార్( లక్షెట్టిపేట్), అప్పుల సుధాకర్‌రెడ్డి ( లక్షెట్టిపేట్) కాసు తిరుపతి (లక్షెట్టిపేట్), అక్కల జగన్ ( దండెపెల్లి), గుర్రాల సత్తి రెడ్డి ( లక్షెట్టిపేట్), గడికొప్పుల మహేష్( దండెపెల్లి), సుంచు సురేష్ (దండెపెల్లి), గుడెల్లి శ్రీధర్, ( గోదావరిఖని) మహేశ్వరి అరవింద్( గోదావరిఖని), ముక్తి రమేష్ (మంచిర్యాల)లను అదుపులోకి తీసుకోగా గోదావరి ఖనికి చెందిన చింతవేణ అనిల్, ఆదిమూలం శ్రీకాంత్‌లు పరారిలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని కమీషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిసిపి రక్షిత కె మూర్తి, ఎసిపి గౌస్‌బాబా, పట్టణ సిఐ ఎడ్ల మహేష్, టాస్క్ ఫోర్స్ సిఐ సాగర్, రూరల్ సిఐ క్రిష్ణ మోహన్, ఎసైలు మారుతి, చందర్, సిబ్బంది పాల్గొన్నారు.

Task Force Police Arrested Cricket Betting Gang

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బెట్టింగ్ రాయుళ్లపై పోలీసుల ఉక్కుపాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: