నైజీరియాలో ట్రక్ పేలి 58 మంది మృతి

  నియామే : నైజీరియా రాజధాని నియామేలో ఒక టాంకర్ ట్రక్ బోల్తా పడి పేలిపోవడంతో 58మంది మరణించారు. బోల్తా పడినప్పుడు అం దులో ఉన్న ఇంధనం ఒలికిపోయింది. దాన్ని తీసుకోడానికి జనం చుట్టూ గుమిగూడిన తరుణంలో పేలుడు సంభవించి అపార ప్రాణనష్టం జరిగింది. ఆదివారం రాత్రి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆర్‌ఎన్ 1 దారిలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ట్రక్, సమీపంలో ఉన్న మోటార్ బైక్‌లు తునాతునకలయ్యాయి. సమీపంలో ఉన్న ఇళ్లు కాలిపోయాయి. […] The post నైజీరియాలో ట్రక్ పేలి 58 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నియామే : నైజీరియా రాజధాని నియామేలో ఒక టాంకర్ ట్రక్ బోల్తా పడి పేలిపోవడంతో 58మంది మరణించారు. బోల్తా పడినప్పుడు అం దులో ఉన్న ఇంధనం ఒలికిపోయింది. దాన్ని తీసుకోడానికి జనం చుట్టూ గుమిగూడిన తరుణంలో పేలుడు సంభవించి అపార ప్రాణనష్టం జరిగింది. ఆదివారం రాత్రి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆర్‌ఎన్ 1 దారిలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ట్రక్, సమీపంలో ఉన్న మోటార్ బైక్‌లు తునాతునకలయ్యాయి. సమీపంలో ఉన్న ఇళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 58 మంది మరణించారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది.

‘హఠాత్తుగా పేలుడు సంభవించిన సమయంలో మోటార్ బైక్‌లు నడిపేవాళ్లు, ఇతరులు ట్రక్ చుట్టూ ఉన్నారు. కనీసం 40 మంది మృతదేహాలు చూశా’ అని స్థానిక వ్యాపారి ఒకరు తెలిపారు. రైల్వే ట్రాక్ పై బోల్తా పడిన ట్రక్ నుంచి కారుతున్న పెట్రోల్‌ను తీసుకునేందుకు అక్కడ చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు.ఆ సమయంలో ట్రక్ పేలింది’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మంటలు అంటుకొని అన్నీ పేలిపోయాయి అని ఒక కాలేజీ విద్యార్థి చెప్పారు.ఇలా ఉండగా… ఆస్పత్రిలో ఉన్న క్షతగ్రాతుల్లో కొంతమందిని నైజీరియా అధ్యక్షుడు మహమదావు ఇస్సౌఫౌ ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రధాని బ్రిగి రఫిని, ఇంటీరియర్ మినిస్టర్ మహమ్మద్‌బజౌమ్ పేలుడు స్థలాన్ని సందర్శించారు.

Tanker truck fuel blast kills 58 in Nigeria

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నైజీరియాలో ట్రక్ పేలి 58 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: