మెగాస్టార్‌తో మిల్కీబ్యూటీ స్టెప్పులు..

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సినిమాను డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఇదివరకే కొత్త షెడ్యూల్ మొదలుకావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఈ షెడ్యూల్ ఆలస్యమైంది. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలను రూపొందించడంలో డైరెక్టర్ కొరటాల శివ దిట్ట అనిపించుకున్నాడు. ఈ సినిమాను కూడా తనదైన స్టైల్‌లో తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర చాలా బలంగా ఉండబోతుందట. చిరు పాత్రలో ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని కొరటాల తెలిపాడు. ప్రస్తుతం 40 శాతం పూర్తయిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయని.. అందులో ఓ మాస్ ఐటమ్ సాంగ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇక మెగా అభిమానులు ఊరుకుంటారా.. మణిశర్మ, చిరంజీవి కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్.. అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఐటమ్ సాంగ్‌లో ఓ స్టార్ హీరోయిన్ నర్తించనుందని తెలిసింది. ఆమె ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ బ్యూటీ మెగాస్టార్‌తో కలిసి ఐటమ్‌సాంగ్‌లో హుషారుగా స్టెప్పులు వేయనుంది. ఈ సాంగ్ సినిమాకే ఓ హైలైట్‌గా ఉంటుందట.

Tamanna special song in Chiranjeevi’s ‘Acharya’?

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మెగాస్టార్‌తో మిల్కీబ్యూటీ స్టెప్పులు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.