ఐటమ్‌సాంగ్స్, బికినీకి ఓకే

  టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోల అందరితో కూడా స్క్రీన్ షేర్ చేసిన ముద్దుగుమ్మ తమన్నా. పుష్కర కాలానికి పైగా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో పాటు చేసిన సినిమాలు కూడా హిట్ కాకపోవడంతో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ బిజీ అయ్యేందుకు ఈ అమ్మడు చేయని ప్రయత్నం అంటూ లేదు. తెలుగు, […] The post ఐటమ్‌సాంగ్స్, బికినీకి ఓకే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోల అందరితో కూడా స్క్రీన్ షేర్ చేసిన ముద్దుగుమ్మ తమన్నా. పుష్కర కాలానికి పైగా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించింది.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో పాటు చేసిన సినిమాలు కూడా హిట్ కాకపోవడంతో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ బిజీ అయ్యేందుకు ఈ అమ్మడు చేయని ప్రయత్నం అంటూ లేదు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ అమ్మడు గతంలో నటించింది. ఇప్పుడు మళ్లీ మూడు భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇదే సమయంలో ఈ అమ్మడు హాట్ లుక్‌లో కనిపించేందుకు ఓకే చెప్పడంతో పాటు బికినీలో కూడా నటించేందుకు సరేనంటోందని తెలిసింది. ఆఫర్లు రావడమే లక్ష్యంగా దర్శక నిర్మాతలకు తమన్నా తన బికినీ విషయాన్ని తెలియజేస్తోందట. ఇప్పుడు ఫిల్మ్‌మేకర్స్ ఆఫర్స్ ఇస్తే సత్తా చాటుతానంటోంది ఈ భామ. ఐటమ్ సాంగ్స్‌తో సహా అన్ని రకాల పాత్రలు చేసేందుకు తమన్నా సిద్ధంగా ఉందట.

Tamanna ready to bikini once again for bollywood

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐటమ్‌సాంగ్స్, బికినీకి ఓకే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: