తాజ్ హోటల్‌కు బాంబ్ బెదిరింపు.. అప్రమత్తమైన ముంబై పోలీసులు

ముంబయిః దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలోని తాజ్ హోటల్ వద్ద మంగళవారం పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సోమవారం తాజ్ హోటల్‌కు పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. దీంతో ఈరోజు తాజ్ హోటల్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనూ పోలీసులు భద్రతను పెంచారు. కాగా, సోమవారం కరాచీలోని స్టాక్ ఎక్సేంజ్ మార్కెట్ కార్యాలయంపై ఉగ్రదాడి జరిగింది. కార్యాలయం ప్రధాన గేట్ వద్ద గ్రనేడ్ దాడి చేసిన మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Taj Hotel Receives Bomb Threat Call from Karachi

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post తాజ్ హోటల్‌కు బాంబ్ బెదిరింపు.. అప్రమత్తమైన ముంబై పోలీసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.