కుక్క నెత్తిన తోక

Dogవాషింగ్టన్ : మీరు చూస్తున్న కుక్కకు నెత్తి మీద కనిపిస్తుంది. నెత్తిన తోక ఉండడంతో ఈ కుక్క ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని మిసోరీలో జంతువులను సరంక్షించే మ్యాక్స్ మిషన్ ఈ కుక్కను చేరదీసింది. రెండు కళ్ల మధ్య తోకతో ఈ కుక్క కనిపిస్తుండడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్ మిషన్ ఇటువంటి అవకారాలతో బాధపడే జంతువులను చేరదీసి సాకుతోంది. నెత్తిన తోక ఉన్న ఈ కుక్కకు నార్వల్ అనే పేరు పెట్టారు. మ్యాక్స్ మిషన్ ఈ కుక్క ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఊహించనిరీతిలో వైరల్ అవుతోంది.

Tail On Dog Head In Missouri At America

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుక్క నెత్తిన తోక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.