18న ప్రీ రిలీజ్ ఫంక్షన్?

Sye raa

 

‘సైరా’ కోసం మెగా టీమ్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వేడుకను కర్నూల్ ప్రాంతంలో నిర్వహించాలని చిరంజీవి, రామ్‌చరణ్ భావిస్తున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ నెల 18న ఈ వేడుకను జరపాలని మెగా కాంపౌండ్ భావిస్తున్నట్టు తెలిసింది.

అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ రానున్నారనే వార్తలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సుమారు రూ.270 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమాకున్న క్రేజ్ మూలంగా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీ ఎత్తున జరుగుతోంది. సినీ స్టార్లు అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నాలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sye raa movie Pre-release function on 18?

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 18న ప్రీ రిలీజ్ ఫంక్షన్? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.