14న ‘సైరా’ మేకింగ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 14న మధ్యాహ్నం 3 గంటల 45 నిముషాలకు ‘సైరా మేకింగ్ వీడియో’ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా సైరా టీమ్ భారీ ఎత్తున ప్రచార […] The post 14న ‘సైరా’ మేకింగ్ వీడియో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 14న మధ్యాహ్నం 3 గంటల 45 నిముషాలకు ‘సైరా మేకింగ్ వీడియో’ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా సైరా టీమ్ భారీ ఎత్తున ప్రచార ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్‌లు కూడా నటించారు. అందుకే ‘సైరా’ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ, తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Sye Raa movie Making vedio released on Aug 14

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 14న ‘సైరా’ మేకింగ్ వీడియో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: