పధాని మోడీతో స్వీడన్ రాజ దంపతుల భేటీ

PM Modi

 

స్వీడన్, భారత్ దైపాక్షిక సంబంధాల పటిష్టతకు ప్రయత్నం

న్యూఢిల్లీ : స్వీడన్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత లక్షంగా స్వీడన్ రాజదంపతులు సోమవారం నుంచి భారత్‌లో ఐదు రోజుల పర్యటన ప్రారంభించారు. స్వీడన్ రాజు కార్ల్ 16 గుస్తఫ్, రాణి సిల్వియా సోమవారం ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నారు. సోమవారం ఉదయం వీరు భారత్‌కు విచ్చేశారు. రాష్ట్రపతి భవన్ వీరికి ఘనంగా స్వాగతించింది. న్యూఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్‌లో ప్రతినిధుల స్థాయి చర్చల కోసం ప్రధాని రాజదంపతులకు స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వారితో కొద్దిసేపు చర్చలు జరిపారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో స్వీడన్‌రాజు ఉభయ దేశాల సంబంధాల పటిష్టతపై చర్చించారు. ముంబై, ఉత్తరాఖండ్‌ను కూడా వీరు సందర్శిస్తారు. సోమవారం ఢిల్లీ లోని జామా మసీదు, ఎర్రకోట, గాంధీ స్మృతిని వీరు సందర్శించారు. భారత్‌ను స్వీడన్ రాజు సందర్శించడం మూడో సారి. అత్యున్నత స్థాయి వాణిజ్య ప్రతినిధులు, కూడా రాజదంపతుల వెంట వచ్చారు. గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక మైత్రి కొనసాగుతోంది. 2018లో రెండు దేశాల మధ్య 3.37 బిలియన్ డాలర్ల వాణిజ్యం సాగింది.

Swedish King Hubertus, Queen Silvia meet PM Modi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పధాని మోడీతో స్వీడన్ రాజ దంపతుల భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.