త్వరలో సుస్మితా సేన్ పెళ్లి ?

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని బాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. రోహ్‌మన్ షాల్ అనే మోడల్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారు. తాను ప్రేమలో ఉన్నట్టు సుస్మిత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. పెళ్లి చేసుకుందామని రోహ్‌మన్ సుస్మితకు ప్రపోజ్ చేశారట. ఆయన ప్రపోజ్‌కు సుస్మిత కూడా అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సుస్మిత ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. దీపావళి […]

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని బాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. రోహ్‌మన్ షాల్ అనే మోడల్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారు. తాను ప్రేమలో ఉన్నట్టు సుస్మిత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. పెళ్లి చేసుకుందామని రోహ్‌మన్ సుస్మితకు ప్రపోజ్ చేశారట. ఆయన ప్రపోజ్‌కు సుస్మిత కూడా అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సుస్మిత ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా సుస్మిత తన ఇద్దరు పిల్లలు, రోహ్‌మన్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. 2019లో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఓ ప్యాషన్ షోలో సుస్మిత, రోహ్‌మన్ కలిసి ర్యాంప్ వాక్ చేశారు. అప్పుడు వారి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. ఆ తరువాత వారు పలు కార్యక్రమాలకు కలిసి హాజరయ్యారు. సుస్మిత పెళ్లి చేసుకోనుందన్న వార్తలు వస్తుండడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sushmita Sen Marriage Soon?

Related Stories: