ఐసిజె తీర్పు జాదవ్ కుటుంబానికి గొప్ప ఓదార్పు: సుష్మా స్వరాజ్

sushma swaraj

 

న్యూఢిల్లీ: మూడేళ్లుగా పాకిస్థాన్ చెరలో మగ్గుతున్న కుల్ భూషణ్ జాదవ్ మరణ శిక్షను నిలిపివేస్తూ హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం భారత్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది. అంతర్జాతీయ న్యాయస్థానం వెలువరించిన తీర్పు జాదవ్ కుటుంబ సభ్యులకు గొప్ప ఓదార్పు అని భారత విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఐసిజె తీర్పుపై సుష్మాస్వరాజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. కుల్‌భూషణ్ జాదవ్ కేసులో తీర్పును స్వాగతిస్తున్నామని,  భారత్ కు ఇదో గొప్ప విజయం అని తెలిపారు. కుల్ భూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు వినిపించి, అంతర్జాతీయ వేదికపై భారత్ కు విజయం అందించినందుకు హరీశ్ సాల్వేకు, ఈ కేసును ఐసిజె దృష్టికి తీసుకెళ్ళిన ప్రదాన మంత్రి మోడీకి సుష్మ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

sushma swaraj tweet on kulbhushan death sentence stayed

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఐసిజె తీర్పు జాదవ్ కుటుంబానికి గొప్ప ఓదార్పు: సుష్మా స్వరాజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.