పసిడి పట్టు…

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ హవా కొనసాగుతోంది. ఎనిమిదో రోజూ భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగించారు. దీంతో కుస్తీ పోటీల్లో సుశీల్‌కుమార్, రాహుల్ అవారే పసిడి పతకాలు  సాధించగా మహిళల కుస్తీ పోటీల్లో బబితా కుమారి వెండి పతకం గెలుపొందగా మరో రెజ్లర్ కిరన్ కాంస్య పతకాన్ని సాధించారు. దీంతో ఇప్పటి వరకు భారత్ ఖాతాలోకి 14 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్యాలు చేరాయి. మొత్తం 31 పతకాలతో […]

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ హవా కొనసాగుతోంది. ఎనిమిదో రోజూ భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగించారు. దీంతో కుస్తీ పోటీల్లో సుశీల్‌కుమార్, రాహుల్ అవారే పసిడి పతకాలు  సాధించగా మహిళల కుస్తీ పోటీల్లో బబితా కుమారి వెండి పతకం గెలుపొందగా మరో రెజ్లర్ కిరన్ కాంస్య పతకాన్ని సాధించారు. దీంతో ఇప్పటి వరకు భారత్ ఖాతాలోకి 14 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్యాలు చేరాయి. మొత్తం 31 పతకాలతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా(147), ఇంగ్లాండ్ (79) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

గోల్డ్ కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటారు. పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో రాహుల్ అవారే స్వర్ణం గెలుచుకున్నాడు. ఫైనల్లో కెనడాకు చెందిన టకహషిని ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. రాహుల్‌కు ఇది రెండో కామన్వెల్త్ స్వర్ణం కావడం విశేషం. పసిడి గెలుచుకున్న రాహుల్ జాతీయ గీతం ఆలపిస్తూ భావోద్వేగానికి గురయ్యి కటంతడి పెట్టుకున్నాడు. దీంతో సహచర క్రీడారులు అతన్ని ఓదార్చారు. కాగా రాహుల్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2011 సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ గెమ్స్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణం దక్కించుకున్న సంగతి తెలిసిందే. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో రెజ్లర్ బబితా కుమారి రజతం సాధించారు. మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ కిరణ్ కాంస్య పతకాన్ని అందుకున్నారు. దీంతో భారత్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 28కు చేరింది.
సుశీల్ ఖాతాలో స్వర్ణం..
పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ సుశీల్ భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని చేర్చాడు. ఈ పోరులో దక్షిణాఫ్రికా రెజ్లర్ బోథాను మట్టికరిపించిన సుశీల్ కుమార్ స్వర్ణం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. కాగా సుశీల్‌కు ఈ పతకం సాధించడం ద్వారా అతని ఖాతాలోకి మూడో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం వచ్చి చేరింది. అంతకు ముందు 2010- సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుపొందిన సుశీల్ 2014-లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. ప్రస్తుతం 2018- ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణం సాధించాడు. కాగా మూడు సార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించి క్రీడాకారుడిగా సుశీల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Related Stories: