సూర్యాపేట ఎస్‌పి బదిలీ.. భాస్కరన్‌కు బాధ్యతలు

Suryapet-SPహైదరాబాద్: సూర్యాపేట ఎస్‌పి వెంకటేశ్వర్లును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ మేరకు వెంకటేశ్వర్లును పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల సంబంధ విధులు అప్పగించవద్దని ఉత్తర్వుల్లో ఇసి పేర్కొంది. ఆయన స్థానంలో ఎస్‌పిగా 2012 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన భాస్కరన్‌కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది.

24 గంటల్లోగా ఇసి ఆదేశాలపై తీసుకున్న చర్యలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషికి తెలిపింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో భాగంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బిజెపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెంకటేశ్వర్లును బదిలీ చేసింది.

ప్రత్యేక వ్యయ పరిశీలకుడు

హుజుర్‌నగర్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రత్యేక వ్యయ పరిశీలకుడి నియమించింది. 1983 ఐఆర్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన బి.ఆర్ బాలక్రిష్ణన్ ఎన్నికల వ్యయంపై ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుందని పేర్కొంది. సిఇఒతో అనుబంధంగా పనిచేయాలని సూచించింది.

Suryapet SP Transfer

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సూర్యాపేట ఎస్‌పి బదిలీ.. భాస్కరన్‌కు బాధ్యతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.