ఆర్కిటిక్ మంచుగడ్డలపై అధ్యయనం

ఆర్కిటిక్ సముద్రంపై విస్తరించే మంచు ఫలకాల కారణంగా వాతావరణంలో మార్పు రావడమే కాదు దాని ప్రభావం ప్రపంచం లోని ఇతర ప్రాంతాలపై కూడా కనిపిస్తోంది. ఈ పరిణామాల గుట్టు తెలుసుకోడానికి పరిశోధన చేయడానికి 17 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు రంగం లోకి దిగారు. ఈ పరిశోధనలో ఆర్కిటిక్ సముద్రంపై విస్తరించిన మంచుఖండాలను చీల్చుకుని ముందుకు సాగే జర్మన్ ఐస్‌బ్రేకర్ ఆర్‌వి పోలార్‌స్టెర్న్ అనే నౌకను వినియోగించుకోనున్నారు. ఏడాది పాటు నిరంతరం సాగే ఈ పరిశోధనకు కావలసిన సైన్సు […] The post ఆర్కిటిక్ మంచుగడ్డలపై అధ్యయనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆర్కిటిక్ సముద్రంపై విస్తరించే మంచు ఫలకాల కారణంగా వాతావరణంలో మార్పు రావడమే కాదు దాని ప్రభావం ప్రపంచం లోని ఇతర ప్రాంతాలపై కూడా కనిపిస్తోంది. ఈ పరిణామాల గుట్టు తెలుసుకోడానికి పరిశోధన చేయడానికి 17 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు రంగం లోకి దిగారు. ఈ పరిశోధనలో ఆర్కిటిక్ సముద్రంపై విస్తరించిన మంచుఖండాలను చీల్చుకుని ముందుకు సాగే జర్మన్ ఐస్‌బ్రేకర్ ఆర్‌వి పోలార్‌స్టెర్న్ అనే నౌకను వినియోగించుకోనున్నారు. ఏడాది పాటు నిరంతరం సాగే ఈ పరిశోధనకు కావలసిన సైన్సు పరికరాలుతోపాటు తినడానికి ఆహార పదార్ధాలు ఇతర సౌకర్యాలు ఈ నౌకలో అమర్చుకుంటున్నారు. మరో రెండు నెలల్లో ఆర్కిటిక్ మంచుగడ్డలపై ఈ నౌకాప్రయాణం ప్రారంభమవుతుంది. సముద్ర మంచు గడ్డలో పెద్దదాన్ని ఒకటి నౌకకు అనుసంధానించుకుని పరిశోధనలు ప్రారంభిస్తారు. ఆ మంచుగడ్డ చుట్టూ ఉన్న సముద్రజలాలు ఏ విధంగా గడ్డకట్టుకుంటాయో గమనిస్తారు. ఉత్తర ద్రువంపై ఏటా శీతాకాలంలో ఇలాంటి మంచు గడ్డలు ఏర్పడడం సహజం. ఉన్నత లక్షాలతో కూడిన ఈ భారీ ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనదిగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఉష్ణోగ్రతలు దిగజారి రోజులు కుదించుకుపోయినప్పుడు ఆ సముద్ర మంచు గడ్డలపైనే శీతాకాల శిబిరాలు ఏర్పాటు చేసుకుని పరిశోధనలు సాగిస్తారు.

ఈ విధంగా మరే కాలం లోనూ లేదా శాటిలైట్ల ద్వారా కానీ ఇటువంటి పరిశోధన సాగించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు మధ్య ఆర్కిటిక్ సముద్ర జలాల్లో ఇరుక్కుని పోయి వాతావరణ ప్రక్రియకు సంబంధించిన కనీస ప్రాథమిక సమాచారం తెలుసుకోడానికి వీలుకాని పరిస్థితి ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితిని మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని పరిశోధకులు వివరించారు. 140 మిలియన్ పౌండ్లతో చేపట్టిన ఈ పరిశోధనకు నేషనల్ ఫౌండేషన్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ ఓషియోనిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, నాసా తదితర అమెరికా సంస్థలు నిధులు అందించాయి. దేశాల మధ్య విభేధాలకు తావులేని రీతిలో సమష్టిగా ఈ పరిశోధన సాగుతుందని భూతాపాన్ని అర్ధం చేసుకోవడమే ప్రధాన లక్షమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధకులకు కావలసిన ఆహారం, ఇతర అవసరాలు చైనా, రష్యా తదితర దేశాలు రెండు నెలలకోసారి తమ ఐస్‌బ్రేకర్ నౌకలతో వెళ్లి అందచేస్తాయి. శాటిలైట్లు అందించిన డేటాతో మంచు గడ్డలపై కొలతలను సమన్వయం చేసుకుని కంప్యూటర్ నమూనాల ద్వారా శీతోష్ణస్థితి, వాతావరణానికి సంబంధించిన ముందస్తు అంచనాలను అభివృద్ధి చేయగలమన్న ఆశాభావంతో శాస్త్రవేత్తలు ఉన్నారు.

Survey on Arctic icebergs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆర్కిటిక్ మంచుగడ్డలపై అధ్యయనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.