రేపు వెలువడనున్న అయోద్య కేసు…

Supreme Court

 

న్యూఢిల్లీ: కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అత్యంత సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. అయోధ్య రామజన్మభూమిపై శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పును వెలువరించనుంది. దీంతో దేశ ప్రజలంతా ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తమైన యూపి ప్రభుత్వం రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. తీర్పు తర్వాత ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసులను మోహరిస్తుంది. యూపితో పాటు దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోనూ పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Supreme Court to deliver Ayodhya Verdict tomorrow

The post రేపు వెలువడనున్న అయోద్య కేసు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.