ఆ జర్నలిస్టును విడుదల చేయండి …

ఢిల్లీ : యుపిలో జ‌ర్న‌లిస్టు ప్రశాంత్ క‌నోజియాను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ ను తక్షణమే విడుదల చేయాలని యుపి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశాంత్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో మంగళవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. యుపి సిఎం యోగిని అవమానించేవిధంగా ఉన్న వీడియోను ప్రసారం చేసిన కేసులో యుపి పోలీసులు ప్రశాంత్ ను అరెస్టు చేవారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని, […] The post ఆ జర్నలిస్టును విడుదల చేయండి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : యుపిలో జ‌ర్న‌లిస్టు ప్రశాంత్ క‌నోజియాను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ ను తక్షణమే విడుదల చేయాలని యుపి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశాంత్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో మంగళవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. యుపి సిఎం యోగిని అవమానించేవిధంగా ఉన్న వీడియోను ప్రసారం చేసిన కేసులో యుపి పోలీసులు ప్రశాంత్ ను అరెస్టు చేవారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని, పౌరుల స్వేచ్ఛ పవిత్రమైందని, స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ఈ హక్కును ఎవరూ బ్రేక్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ ను  తక్షణమే విడుదల చేయాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

యుపిలో ఓ ప్రైవేటు టివి ఛానల్ అధినేత, ఆ ఛానల్ ఎడిటర్, ఓ జర్నలిస్టను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ మహిళ సిఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఎదుట మీడియాతో మాట్లాడారు. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ సిఎం యోగికి ప్రతిపాదనలు పంపినట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను నోయిడాకు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కనోజియా ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోను ఓ ప్రైవేటు ఛానల్ కూడా ప్రసారం చేసింది. దీంతో బిజెపి కార్యకర్తలు సదరు టివి ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఛానల్ అధినేత ఇపితా సింగ్, ఎడిటర్ అనూజ్ శుక్లాను అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా ఛానల్ నిర్వహిస్తున్నారంటూ మరో కేసు కేసు కూడా నమోదు చేశారు. అంతేకాదు ఫేస్ బుక్, ట్విట్టర్ లో వీడియోను పోస్టు చేసి, సిఎం యోగి ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపిస్తూ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కోర్టు పైవిధంగా వ్యాఖ్యానిస్తూ ప్రశాంత్ ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.

Supreme Court Tells UP Govt To Release Journalist

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ జర్నలిస్టును విడుదల చేయండి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: