జయలలిత మృతి కేసు విచారణపై స్టే

Jayalalithaఢిల్లీ : తమిళనాడు దివంగత సిఎం జయలలిత మృతి కేసు విచారణపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది.  జయ మృతిపై విచారణ చేస్తున్న కమిషన్ పై అపోలో ఆసుపత్రి యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అపోలో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో అపోలో యాజమాన్యం  సుప్రీంకోర్టును  ఆశ్రయించింది. పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. జయ మృతిపై విచారణపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జయ మృతిపై  అరుముగస్వామి కమిషన్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. జయ వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ సహా 100 మందికి పైగా వ్యక్తులను అరుముగస్వామి కమిషన్ విచారణ చేసింది. వీరిలో అపోలో ఆసుపత్రి రేడియాలజిస్ట్ డాక్టర్ మీరా, ఎమర్జెన్సీ డాక్టర్ పజని కూడా ఉన్నారు. తమ వైద్యులను కమిషన్ వేధిస్తోందని ఆరోపిస్తూ అపోలో యాజమాన్యం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  2016లో అపోలో హాస్ప‌ట‌ల్‌లో 75 రోజుల పాటు చికిత్స పొందిన త‌ర్వాత జ‌య మ‌ర‌ణించిన విషయం విదితమే.

Supreme Court Stay on Jayalalitha Death Case Trial

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జయలలిత మృతి కేసు విచారణపై స్టే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.