మమతకు క్షమాపణ చెప్పి వెళ్లిపోండి

  మార్ఫింగ్ ఫోటోపై బిజెపి నేతకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్ఫ్‌డ్ ఫోటోను సోషల్ మీడియాలో ఉంచినందుకు అరెస్టయిన బిజెపి యువమోర్చా నాయకురాలు ప్రియాంక శర్మకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే జైలునుంచి విడుదలయ్యేటప్పుడు ఆమె మమతకు క్షమాపణ చెప్పాలని షరతు విధించింది. జైలునుంచి విడుదల చేసిన తర్వాత మార్ఫింగ్ చేసిన ఫోటోను ఉంచినందుకు ప్రియాంక శర్మ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని న్యాయమూర్తులు ఇంది రా బెనర్జీ, సంజయ్ […] The post మమతకు క్షమాపణ చెప్పి వెళ్లిపోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మార్ఫింగ్ ఫోటోపై బిజెపి నేతకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్ఫ్‌డ్ ఫోటోను సోషల్ మీడియాలో ఉంచినందుకు అరెస్టయిన బిజెపి యువమోర్చా నాయకురాలు ప్రియాంక శర్మకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే జైలునుంచి విడుదలయ్యేటప్పుడు ఆమె మమతకు క్షమాపణ చెప్పాలని షరతు విధించింది. జైలునుంచి విడుదల చేసిన తర్వాత మార్ఫింగ్ చేసిన ఫోటోను ఉంచినందుకు ప్రియాంక శర్మ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని న్యాయమూర్తులు ఇంది రా బెనర్జీ, సంజయ్ ఖన్నాల తో కూడిన వెకేషన్ బెంచ్ వాదనల సందర్భంగా ఆమె తరఫు న్యాయవాది ఎన్‌కె కౌల్‌కు స్పష్టం చేసింది. ఎన్నికల సమయం కావడం, ప్రియాంక రాజకీయ పార్టీ కార్యకర్త అయినందున ఈ సమయంలో క్రిమినల్ చర్యల అంశాన్ని ప్రస్తావించడం లేదని, అయితే ఎన్నికల నేపథ్యంలో ఆమె క్షమాపణలు చెప్పడం తప్పనిసరని బెంచ్ స్పష్టం చేసింది. భావప్రకట నా స్వేచ్ఛ పేరిట వేరొకరి వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీయడాన్ని తాము క్షమించబోమని, క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని బెంచ్ స్పష్టం చేసింది. మమతా బెనర్జీ ఫోటోను మెట్ గాలాలోని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఫోటోతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు ప్రియాంక శర్మను కోల్‌కతా పోలీసులు ఈ నెల 10న అరెస్టు చేశారు.

supreme court notice issued for priyanka sharma

The post మమతకు క్షమాపణ చెప్పి వెళ్లిపోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: