పాలమూరులో సూపర్ ఉమెన్

హైదరాబాద్‌ః మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు మహిళలు స్వచ్చందంగా లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో రహదారులపైకి వచ్చే వాహన చోదుకులను నిలిపి కారణాలు లేకుండా రావద్దంటూ వేడుకుంటున్నారు. ఎవరికి వారు స్వీయ రక్షణ పాటించాలని వాహన చోదకులకు సదరు మహిళలు పాఠాలు చెబుతున్నారు. ఒక్కరు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా యావత్ కుటుంబ కరోనా బారీన పడే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించాలన్న నిబంధనతో పాటు అకారణంగా రోడ్లపైకి రావద్దంటూ వారు వివరిస్తున్నారు. వైరస్ […] The post పాలమూరులో సూపర్ ఉమెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ః మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు మహిళలు స్వచ్చందంగా లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో రహదారులపైకి వచ్చే వాహన చోదుకులను నిలిపి కారణాలు లేకుండా రావద్దంటూ వేడుకుంటున్నారు. ఎవరికి వారు స్వీయ రక్షణ పాటించాలని వాహన చోదకులకు సదరు మహిళలు పాఠాలు చెబుతున్నారు. ఒక్కరు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా యావత్ కుటుంబ కరోనా బారీన పడే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించాలన్న నిబంధనతో పాటు అకారణంగా రోడ్లపైకి రావద్దంటూ వారు వివరిస్తున్నారు. వైరస్ లక్షణాలు సోకకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వైరస్ సోకితే ఇంటిల్లిపాది అవస్థలకు గురికావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. సూపర్ మహిళల స్పూర్తిని ప్రతిఒక్కరూ ఆచరించాలని జిల్లా ఎస్‌పి రెమా రాజేశ్వరి వివరిస్తున్నారు.

క్యాన్సర్ పేషెంట్ కుటుంబానికి బియ్యం పంపిణీ

హయత్‌నగర్ మండలంలోని శాంతినగర్ కాలనీలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న దినసరి కూలీ కుటుంబానికి రాచకొండ పోలీసులు 25కిలోల బియ్యం పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో కూలీకి వెళ్లలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబం గురించి తెలుసుకున్న పోలీసులు బియ్యం, తదితర వస్తుసామాగ్రిని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు సదరు కూలీ కుటుంబాన్ని ఆదుకోవాలని డిజిపి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.

Superwomen of Mahabubnagar step up to help police

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాలమూరులో సూపర్ ఉమెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: