సన్‌స్క్రీన్ రాయడం మరవొద్దు

  ఎండాకాలంలో బయటకు వెళ్లాలంటే ఆందోళనకు గురౌతారు చాలామంది. ఒక్క ఆరోగ్య విషయంలోనే కాదు, శరీరపు ఛాయకు కూడా లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అలాంటివేవీ రాకుండా ఉండాలంటే ఈ సలహాలు తప్పక పాటించాలి. 1. చర్మానికి హాని కలగకుండా, తాజాగా ఉంచడానికి తగినన్ని నీళ్లు తాగాలి. దీంతోపాటు కొబ్బరి నీళ్లు కూడా తాగాలి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. 2. చర్మ తత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్‌ను వెతకడం కష్టమైన పనే. కానీ దీనివల్ల లాభం […] The post సన్‌స్క్రీన్ రాయడం మరవొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎండాకాలంలో బయటకు వెళ్లాలంటే ఆందోళనకు గురౌతారు చాలామంది. ఒక్క ఆరోగ్య విషయంలోనే కాదు, శరీరపు ఛాయకు కూడా లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అలాంటివేవీ రాకుండా ఉండాలంటే ఈ సలహాలు తప్పక పాటించాలి.

1. చర్మానికి హాని కలగకుండా, తాజాగా ఉంచడానికి తగినన్ని నీళ్లు తాగాలి. దీంతోపాటు కొబ్బరి నీళ్లు కూడా తాగాలి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.
2. చర్మ తత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్‌ను వెతకడం కష్టమైన పనే. కానీ దీనివల్ల లాభం కూడా ఉంది. భారతీయుల చర్మం కోసం ౩౦ నుంచి 50 ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ ఉపయోగకరంగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్న వారికి జెల్‌తో కూడిన సన్‌స్క్రీన్ కూడా లభిస్తుంది. ఎండలో బయటికి వెళ్లడానికి కనీసం 20 నిమిషాల ముందు చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ లేదా జెల్ తప్పకుండా రాసుకోవాలి.
3. వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. దీంతో చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
4. ఎండలో కళ్లను సురక్షితంగా ఉంచడానికి సన్‌గ్లాస్‌లు పెట్టుకోవాలి.
5. రోజ్‌వాటర్, శనగపిండి, పెరుగు లాంటి సహజ పదార్థాల సహాయంతో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చర్మాన్ని తప్పకుండా టోన్ చేసుకోవాలి. దీంతో చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఒకవేళ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం జిడ్డుగా మారితే వేసవిలో తేమ ఉన్న మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి.
6. ట్యాన్‌ను తొలగించడానికి మీరు ముఖానికి పెరుగు రాసుకోవచ్చు. ఇందులో తేనె, ఓట్‌మీల్, దోసకాయ, కీరా లేదా నిమ్మరసం కూడా కలపొచ్చు.
7. ఈ కాలంలో ఎక్స్‌ఫోలియేషన్ తప్పనిసరి. ఎందుకంటే రోజంతా ముఖంపై పేరుకుపోయే మలినాలను తొలగించడం తప్పనిసరి. అందుకే వారంలో కనీసం రెండు సార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ తప్పనిసరిగా చేసుకోవాలి.

Sunscreen For Beauty Body Shade In Summer

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సన్‌స్క్రీన్ రాయడం మరవొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: