గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డ్‌కు ఎంపికైన సుందర్ పిచాయ్

  వాషింగ్టన్: భారత సంతతికి చెందిన గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2019కి గానూ సుందర్ పిచాయ్‌తో పాటు నాస్‌డాక్ సిఇఒ అడేనా ఫ్రైడ్‌మాన్‌ను ఎంపికయ్యారు. అమెరికా భారత వాణిజ్య మండలి(యుఎస్‌ఐబిసి) ప్రతి ఏటా ఈ అవార్డు అందజేస్తుంది. ఈ రెండు కంపెనీలు ప్రపంచ సాంకేతికరంగ అభివృద్ధికి అందిస్తున్న సేవలకు గానూ వారిని ఎంపిక చేసినట్లు యుఎస్‌ఐబిసి తెలిపింది. గూగుల్ వృద్ధికి భారత్ ఎంతగానో తోడ్పాటునందిస్తోందని, ఈ […] The post గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డ్‌కు ఎంపికైన సుందర్ పిచాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2019కి గానూ సుందర్ పిచాయ్‌తో పాటు నాస్‌డాక్ సిఇఒ అడేనా ఫ్రైడ్‌మాన్‌ను ఎంపికయ్యారు. అమెరికా భారత వాణిజ్య మండలి(యుఎస్‌ఐబిసి) ప్రతి ఏటా ఈ అవార్డు అందజేస్తుంది. ఈ రెండు కంపెనీలు ప్రపంచ సాంకేతికరంగ అభివృద్ధికి అందిస్తున్న సేవలకు గానూ వారిని ఎంపిక చేసినట్లు యుఎస్‌ఐబిసి తెలిపింది. గూగుల్ వృద్ధికి భారత్ ఎంతగానో తోడ్పాటునందిస్తోందని, ఈ క్రమంలో జరిగిన సాంకేతికాభివృద్ధితో ప్రజల జీవన విధానం ఎంతగానో మెరుగు పడిందని ఈ సందర్భంగా పిచాయ్ అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జరగబోయే ‘ఇండియా ఐడియాస్’ సదస్సులో వీరికి అవార్డును ప్రదానం చేయనున్నారు. గూగుల్, నాస్‌డాక్ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్ మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150 శాతం మేర వృద్ధి చెందినట్లు యుఎస్‌ఐబిసి పేర్కొంది.

Sundar Pichai selected for the Global Leadership Award

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డ్‌కు ఎంపికైన సుందర్ పిచాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: