క్వార్టర్స్ ఫైనల్లో సుమీత్ జోడీ

టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన మను అత్తిరి సుమీత్ రెడ్డి జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జంట 15-21, 23-21, 21-19 తేడాతో ఒలింపిక్స్ రజత పతక విజేత జోడీ గో విశామ్‌టాన్ వి కియాంగ్ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. తొలి సెట్‌లో సుమీత్ జోడీకి ఓటమి ఎదురైంది. మలేసియా జంట దూకుడుగా ఆడుతూ పట్టుబిగించింది. ఇదే క్రమంలో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ […]

టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన మను అత్తిరి సుమీత్ రెడ్డి జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జంట 15-21, 23-21, 21-19 తేడాతో ఒలింపిక్స్ రజత పతక విజేత జోడీ గో విశామ్‌టాన్ వి కియాంగ్ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. తొలి సెట్‌లో సుమీత్ జోడీకి ఓటమి ఎదురైంది. మలేసియా జంట దూకుడుగా ఆడుతూ పట్టుబిగించింది. ఇదే క్రమంలో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ సెట్‌ను గెలుచుకుంది. కానీ తర్వాతి రెండు సెట్‌లలో సుమీత్ జంట చెలరేగి ఆడింది. ప్రత్యర్థి జోడీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా పట్టు వీడకుండా పోరాడింది. హోరాహోరీగా సాగిన రెండో సెట్‌లో 2321తో జయభేరి మోగించింది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత జోడీ మ్యాచ్‌ను సొంతం చేసుకుని క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే సాత్విక్‌చిరాగ్ జోడీకి చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డిఅశ్విని జోడీ కూడా పరాజయం పాలైంది.

Comments

comments

Related Stories: