వేసవి కాలం దొంగలకు మాత్రం వర్కింగ్ డేస్

  నల్లగొండ: వేసవి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సెలవులు.. విహార యాత్రలు, పిల్లలకు పరీక్షలు అయిపోగానే సరదాగా వారితో కలిసి దూర ప్రాంతాలు, తీర్ధయాత్రలకు వెళ్లి రావాలని చాలా మంది భావిస్తుంటారు. నిత్యం పని వత్తిడితో సతమతమయ్యే వారు వారం, పది రోజుల పాటు సేద తీరడానికి వేసవి సెలవులకు ప్లాన్ చేసుకోవడం మామూలే. అయితే వేసవి కాలం దొంగలకు మాత్రం వర్కింగ్ డేస్ అంటున్నారు పోలీసులు. గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా […] The post వేసవి కాలం దొంగలకు మాత్రం వర్కింగ్ డేస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ: వేసవి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సెలవులు.. విహార యాత్రలు, పిల్లలకు పరీక్షలు అయిపోగానే సరదాగా వారితో కలిసి దూర ప్రాంతాలు, తీర్ధయాత్రలకు వెళ్లి రావాలని చాలా మంది భావిస్తుంటారు. నిత్యం పని వత్తిడితో సతమతమయ్యే వారు వారం, పది రోజుల పాటు సేద తీరడానికి వేసవి సెలవులకు ప్లాన్ చేసుకోవడం మామూలే. అయితే వేసవి కాలం దొంగలకు మాత్రం వర్కింగ్ డేస్ అంటున్నారు పోలీసులు. గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరగడానికి గల కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మన తెలంగాణ కథనం..

వేసవిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి కానుక కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లేందుకు మక్కువ చూపుతారు. దీంతో ఇండ్లకు తాళాలు వేయక తప్పని పరిస్థితి. దీన్ని దొంగలు అనుకూలంగా మార్చుకొని, ఒకటి, రెండు రోజులకు మించి ఇండ్లకు తాళాలు వేసి ఉన్నట్టు కనిపిస్తే రెక్కీ వేసి మరీ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అయితే వేసవిలో గాలి కొరకు తలుపులు, కిటికీలు రాత్రి పూట తెరచి పడుకుంటుట్టారు. అయితే దొంగలు ఇదే అదునుగా భావిస్తూ చోరీలు చేస్తుంటారు. మిట్ట మధ్యాహ్నం ఆ బ్యాంకుల నుంచి నగదు తీసుకునే వారు, లేదా నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారిని దొంగలు టార్గెట్ చేస్తారు. వేసవిలో పెళ్ళిళ్ల సీజన్ కావడంతో మహిళలు ఎక్కువగా షాపింగ్‌లకు వెళ్తుంటారు. దీన్ని కూడా దొంగలు అవకాశంగా తీసుకుని రద్దీగా ఉండే చోట బ్యాగులు, పర్సులు చోరీ చేస్తున్నారు.

సమాచారమిస్తే.. పోలీసుల నిఘా: హాలియా సిఐ ధనుంజయ్యగౌడ్
వేసవి సెలవుల్లో ఊరికిగాని, తీర్ధయాత్రలకు గాని వెళ్లే వారు తమకు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామని హాలియా సిఐ ధనుంజయ్యగౌడ్ తెలిపారు. విలువైన నగలు, నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో లేదా నమ్మకస్తుల ఇంట్లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. విహారయాత్రలు, ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ఇండ్లకు తాళం వేయాల్సి వస్తే ముందుగా పోలీసులకు సమాచార మివ్వాలి. చాలా రోజులు తాళం వేసి కుటుంబ సభ్యులంతా బయటికి వెళ్లాలనుకుంటే చుట్టు పక్కల వారికి, బంధువులకు, స్నేహితులకు తప్పకుండా సమాచారమివ్వాలన్నారు. ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, నగలు ఉంచొద్దు. మధ్యాహ్నం పూట బయటికి ఒంటరిగా వెళ్లే మహిళలు మెడలో విలువైన బంగారు అభరణాల వేసుకుని వెళ్లినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలను నివారించడానికి ఇండ్ల ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఎంతో మంచిదని అన్నారు. అలాగే తాళాల్ని కూడా కంపెనీవి వాడితే మరిమంచిదని సూచించారు. అదే విధంగా మీమీ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఫోన్ 9440795621, 9440700074 నంబర్స్‌కు సమాచారం అందించాలని కోరారు.

Summer season is Working days to Thefts

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వేసవి కాలం దొంగలకు మాత్రం వర్కింగ్ డేస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: