కళాశాల భనవంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య

 

నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలో వినాయక్‌నగర్ ప్రాంతంలో ఓ విద్యార్థిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం శ్రీమేధ కళాశాల భవనంపై నుండి బైపిసి చదువుతున్న విద్యార్థిని వర్ష (18) దూకింది.  తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్సై తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Suicide of Sri Medha college student

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కళాశాల భనవంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.