సూసైడ్ నోట్ వైరల్…

Suicide

 

అప్పులిచ్చిన వారి జాబితాను ప్రకటించి అదృశ్యమైన వ్యక్తి

భర్త కనిపించటం లేదని భార్య ఫిర్యాదు

ఖమ్మం : అప్పుల పాలైయ్యాయని ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి సామాజిక మాద్యమాల్లో సూసైడ్ నోట్, వీడియోను పెట్టాడు. ఈ సంఘటన ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని కవిరాజ్‌నగర్‌లో చోటు చేసుకుంది. వైరాకు చెందిన నరసింహారావు పలు దినపత్రికలకు ప్రకటనలు సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. నరసింహారావు భార్య ఓ న్యాయవాది వద్ద ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇటీవల వ్యాపారం అభివృద్ధి పేరుతో నర్సింహారావు పలువురి వద్ధ అధికశాతం వడ్డీకి తీసుకున్న అప్పులు భారీగా పెరగటంతో వాటిని చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకపోయాడు. అది కోట్లలో ఉంటుందని సమాచారం. అయితే అప్పులు, తనకు రావాల్సిన బాకీలను ప్రస్తావిస్తూ సూసైడ్ నోట్ రాశాడు. ఈ లేఖతో పాటు తాను మృతి చెందుతాను అంటూ ఓ సూసైట్ వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. తాను అప్పులు చెల్లించాల్సిన వారి పేర్లను లేఖలో స్పష్టం చేశాడు.

తనకు రావాల్సిన రూ.2 కోట్లను సైతం వివరించాడు. ఓ వ్యక్తి తనకు రూ. 1.50 కోట్లు ఇవ్వాలని, అతను ఇవ్వకపోవటం వల్లే మరిన్ని అప్పులు చేశానని తెలిపాడు. తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువ వడ్డీలు కంటానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భర్త గత ఐదు రోజులుగా కనిపించటం లేదంటూ నరసింహారావు భార్య ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారు. 26 మంది రుణదాతలకు రూ.12 కోట్ల వరకు అప్పులు తీర్చవలసి ఉంటుందని నర్సింహారావు సూసైడ్ సెల్ఫీ, సూసైడ్ వీడియోలో రుణ బాధలను వివరించాడు.

Suicide note is viral

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సూసైడ్ నోట్ వైరల్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.