సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో.. కామెడీ ఎంటర్‌టైనర్

sudigali-sudheer

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా ’రాజుగారి గది’ ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా పారిశ్రామిక వేత్త కె.శేఖర్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డాక్టర్ ఎన్.శివప్రసాద్ నటించిన చివరి చిత్రమిది కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ 10 మిలియన్ వ్యూస్‌కి పైగా సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ “ఈ సినిమా ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంటోంది.

షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సుధీర్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది. ఇటీవల మనకు దూరమైన మాజీ ఎంపి, నటుడు డా.శివప్రసాద్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్ శేఖర్ రాజు ఒక రోల్ చేయడం జరిగింది”అని అన్నారు. హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ “సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ధన్య బాలకృష్ణతో షూటింగ్ ఫన్నీగా జరిగింది. ఇప్పటివరకు నన్ను ఎలా సపోర్ట్ చేశారో వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.

కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండడం ఈ సినిమా ప్రత్యేకత. అలాగే ఈ సినిమాలో డ్యాన్సులు, ఫైట్స్ చేశాను. డిసెంబర్ మొదటి వారంలో సినిమా విడుదల అనుకుంటున్నాం”అని చెప్పారు. హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ “సుధీర్ అభిమానులు కేవలం ఆయన్ని ఫాలో చేయడం కాదు ఆయన్ను ప్రేమిస్తారని షూటింగ్ మొదలు పెట్టిన రోజే తెలుసుకున్నాను. రేపు సినిమా హిట్ అయితే దానికి కేవలం ఆయన ఫ్యాన్సే కారణం”అని తెలిపారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత కె. శేఖర్ రాజు పాల్గొన్నారు.

Sudigaali Sudheer as Hero in Software Sudheer Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో.. కామెడీ ఎంటర్‌టైనర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.