ఆకస్మికంగా తనిఖీలు…

  ఆదిలాబాద్‌: ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆకస్మింగా తనిఖీ చేసి భద్రత అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లాల పోలీసు అధికారులను భద్రత ఇన్ చార్జీ లుగా నియమించినట్లు సూచించారు. సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి వీక్షించి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూంలను సందర్శించిన వారు ప్రతి ఒక్కరి సంతకం భద్రత అధికారులు రిజిస్టర్లో […] The post ఆకస్మికంగా తనిఖీలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్‌: ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆకస్మింగా తనిఖీ చేసి భద్రత అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లాల పోలీసు అధికారులను భద్రత ఇన్ చార్జీ లుగా నియమించినట్లు సూచించారు. సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి వీక్షించి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

స్ట్రాంగ్ రూంలను సందర్శించిన వారు ప్రతి ఒక్కరి సంతకం భద్రత అధికారులు రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని, సందర్శించిన సమయం వెళ్లిన సమయము నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఏ సమయంలో అయినా ఆకస్మీక తనిఖీలు చేపడతానని, అధికారులు అన్ని వేళల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాత్రి సమయంలో మూడు చోట్ల భవనాల చుట్టూ పెట్రోలింగ్, గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సయ్యద్ సుజాద్దిన్, నిర్మల్ జిల్లా సీఐ పోతారం శ్రీనివాస్, కొమురం భీం ఆసిఫాబాద్ సీఐ వెంకటేశ్వర్లు, సిఆర్పిఎఫ్ భద్రతాధికారి విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Sudden checks at EVM strong rooms

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆకస్మికంగా తనిఖీలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: