డిప్లమా ఆప్తమాలజీలో వైద్యురాలికి గోల్డు మెడల్

కమలాపూర్: ఉత్తమ ఫలితాలే లక్షంగా పట్టుదలతో చదివి పదిలోనే స్కూల్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధీని ఇంటర్‌లోనూ అదే ఊపుతో చదువులో సత్తాచాటి స్టేట్ ఏడో ర్యాంక్, ఎంబిబియస్ ఎంట్రెన్స్‌లోనూ తెలంగాణ రిజియన్‌లో ఐదో ర్యాంక్ సాధించి, ఇపుడు డిప్లమా ఆప్తమాలజీలో గోల్డు మెడల్ సాధించిన వైద్య విద్యార్ధీ గూడేపు సుచిత కమలాపూర్ మండలానికి గర్వంగా నిలిచి పలువురికి ఆదర్శమయ్యింది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన గూడేపు మొగిళయ్య- హైమావతి దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. మొగిళయ్య […]

కమలాపూర్: ఉత్తమ ఫలితాలే లక్షంగా పట్టుదలతో చదివి పదిలోనే స్కూల్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధీని ఇంటర్‌లోనూ అదే ఊపుతో చదువులో సత్తాచాటి స్టేట్ ఏడో ర్యాంక్, ఎంబిబియస్ ఎంట్రెన్స్‌లోనూ తెలంగాణ రిజియన్‌లో ఐదో ర్యాంక్ సాధించి, ఇపుడు డిప్లమా ఆప్తమాలజీలో గోల్డు మెడల్ సాధించిన వైద్య విద్యార్ధీ గూడేపు సుచిత కమలాపూర్ మండలానికి గర్వంగా నిలిచి పలువురికి ఆదర్శమయ్యింది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన గూడేపు మొగిళయ్య- హైమావతి దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. మొగిళయ్య ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తుండగా, భార్య హైమావతి ఏఎన్‌యంగా సిర్పూర్ కాగాజ్‌నగర్‌లో విధులు చేపడుతుంది. చిన్న తనంలోనే బాగా కష్టపడి ఉద్యోగరీత్యా స్ధిరపడ్డ తల్లిదండ్రులను చూసి ఓనమాలు నేర్చుకున్న కూతురు సుచిత కష్టపడి చదువుకుని ఉన్నత స్ధానంకు ఎదుగాలన్న కోరిక బడికి వెళ్ళే వయస్సులోనే అలవర్చకుంది. ముచ్చర్ల గ్రామంలోని మిలీనియం స్కూల్‌లో బాగా కష్టపడి చదివి 2006 పది ఫలితాల్లో స్కూల్ టాపర్‌గా నిలిచి అత్యధికంగా 563 మార్కులు సంపాదించింది. ఇంటర్ మీడియట్ విద్యను హైదరాబాద్‌లోని కొత్తపేట, దిల్‌షుక్‌నగర్ నారాయణ కాలేజీలో బయోలాజికల్ సైన్స్ విద్యను అభ్యసించింది.

ఇంటర్ ప్రధమ సంవత్సర ఫలితాల్లోనే 427 మార్కులతో స్టేట్ ఏడో ర్యాంక్‌ను సాధించగా అత్యధిక మార్కులతో ఇంటర్ విద్యను పూర్తి చేసింది. ఇక ఎంబిబియస్ ఎంట్రెన్స్ పరీక్షలో 160కి 137 మార్కులు సాధించి తెలంగాణ రీజియన్‌లోనే ఎస్సి మహిళా విభాగంలో ఐదో ర్యాంక్‌ను సంపాదించుకుని హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించగా, ప్రస్తుతం పిజి కోర్సును కూడా ఉస్మానియాలో పూర్తి చేసింది. చదువుల్లో దిట్ట అయిన సుచిత డిప్లమా ఆప్తమాలజీ సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో పూర్తి చేసి అత్యుత్తమ ప్రతిభతో గోల్డు మెడల్ సాధిచింది. గోల్డు మెడల్ సాధించిన సుచితను సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్య బృందం బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గోల్డు మెడల్‌తో పాటు మోమెంటోను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కూతురు ఆప్తమాలజీ డిప్లమాలో గోల్డు మెడల్ సాధించడంపట్ల తల్లిదండ్రులు మొగిళయ్య-హైమావతి హర్షం వ్యక్తం చేస్తూ కష్టపడి చదివితే ఎవరైనా ఉత్తమ ఫలితాలను అనుభవించ వచ్చని తెలిపారు. కాగా వంగపల్లి వాసి అయిన వైద్యురాలు సుచితకు గోల్డు మెడల్ రావడంపట్ల గ్రామస్ధులు, మండల వాసులు అభినందనలు వ్యక్తం చేస్తూ ఆదర్శవంతమైన విద్యకు సహకరించిన తల్లిదండ్రులను, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను ఆధిరోహించిన సుచితను మెచ్చకుంటున్నారు.

suchitha gold medal achieved in diploma ophthalmology

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: