వరుస ఎన్నికలతో స్తంభించిన పాలన

ఆదిలాబాద్ ప్రతినిధి : వరుసగా జరుగుతున్న ఎన్నికల కారణంగా సాధారణ పరిపాలన దాదాపుగా స్తంభించిపోయింది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ పరిపాలనతో పాటు వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల శాఖలే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలన్ని దాదాపుగా స్తంభించిపోయాయి. గత ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ప్రతిష్టంభన మరో నెల రోజుల పాటు కొనసాగనుండగా, మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైతే మరో నెల రోజుల […] The post వరుస ఎన్నికలతో స్తంభించిన పాలన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ ప్రతినిధి : వరుసగా జరుగుతున్న ఎన్నికల కారణంగా సాధారణ పరిపాలన దాదాపుగా స్తంభించిపోయింది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ పరిపాలనతో పాటు వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల శాఖలే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలన్ని దాదాపుగా స్తంభించిపోయాయి. గత ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ప్రతిష్టంభన మరో నెల రోజుల పాటు కొనసాగనుండగా, మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైతే మరో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి ముగిసిన 20 రోజుల తరువాత పంచాయతీ ఎన్నికల కారణంగా మరోసారి కోడ్ తెరపైకి వచ్చింది. ఓవైపు ఎన్నికలు, మరో వైపు ఎన్నికల విధుల కారణంగా అధికార యంత్రాంగం అంతా అదే పనుల్లో నిమగ్నమైంది. ఆ తరువాత కొన్ని నెలలు మాత్రమే గడువు ఉండగా, బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ తరుణంలోనే పార్లమెంట్ ఎన్నికల నియమావళి రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. దీంతో ప్రజలు మామూలు పనుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖల ద్వారా భూములకు సంబంధించిన వ్యవహరాలే కాకుండా అనేక కార్యకలాపాలకు ఎన్నికల వ్యవహారం ఆటంకంగా మారుతోంది. గత ఆరె నెలల నుంచి సాధారణ ప్రజానీకం తమ పనుల కోసం కార్యాలయాల చూట్టు తిరుగుతూ అలసిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పాటు వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలకు సైతం ఎన్నికల కారణంగా గ్రహణం పట్టింది. వివిధ శాఖల్లో సబ్సిడీ పథకాల కోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తైనప్పటికీ, ఆ పథకాల అమలుకు ఎన్నికలు బ్రేక్ వేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగియగానే లోక్‌సభ ఎన్నికలు రావడం జరిగింది. అయితే కోడ్ అమలులో ఉండగానే ఎన్నికల కమిషన్ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ వైపు ఎన్నికల కోడ్ కారణంగా, మరోవైపు అధికార యంత్రాంగం అంతా ఎన్నికల బిజీ కారణంగా సాధారణ పరిపాలన పూర్తిగా స్తంభించిందని అంటున్నారు. దీంతో పాటు వివిధ రకాల సంక్షేమ, అభివృద్ది పథకాలు సైతం అర్ధాంతరంగా నిలిచిపోనున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే అనేక రకాల సబ్సిడీ పథకాల కోసం ఎంపికైన లబ్దిదారులంతా ఈ పథకాలు తమకు ఎప్పుడు వర్తిస్తాయోనన్న ఆందోళనలో ఉన్నారు. అయితే వరుస ఎన్నికల పుణ్యమా అని ఈ లబ్దిదారులంతా తీవ్ర మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైనందున ఆ ప్రక్రియను కొనసాగించే బాధ్యత అన్ని శాఖలపై ఉంటుందనేది బహిరంగ సత్యమే. దీని కారణంగానే ప్రజాస్వామ్య మనుగడకు కీలకంగా నిలుస్తున్న ఎన్నికల వ్యవహారం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ వైపు పాలన, మరో వైపు సంక్షేమం, అభివృద్ది అవసరమే కనుక ఎన్నికలతో ఏర్పడే సమస్యలు సైతం సాధారణమేనని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Successive Elections Effect on Ruling

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వరుస ఎన్నికలతో స్తంభించిన పాలన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: