నౌకాదళంలో తొలి మహిళా పైలట్ శివాంగి

Sub Lieutenant Shivangi

 

కోచి: సబ్ లెఫ్ట్‌నెంట్ శివాంగి సోమవారం భారత నౌకాదళంలో మొదటి మహిళా పైలట్‌గా చేరారు. ఆపరేషనల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆమె ఈ పదవిని స్వీకరించారని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన శివాంగి నౌకాదళంలోని నిఘా విమానం డోర్నియర్‌కు పైలట్‌గా పనిచేస్తారు. నౌకా దినోత్సవానికి రెండు రోజుల ముందు దళంలో చేరిన శివాంగి పట్టభద్రురాలు. నావికా దళంలో ఆమె మొదటి మహిళా పైలట్ అని ఆ ప్రతినిధి చెప్పారు. కేరళలోని కోచి నౌకా స్థావరంలో శివాంగి విధులు నిర్వహిస్తారు.

మహిళలున్నారు కానీ…
విధుల్లో చేరిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ శివాంగి ‘పైలట్ కావడం నాకు, మా తలిదండ్రులకు సంతోషంగా ఉంది. ఇదొక గొప్ప అనుభూతి. మాటల్లో చెప్పలేను. చాలాకా లం నుంచీ పైలట్ కావాలనుకుంటున్నాను. మా కుటుం బం కూడా అదే కోరుకుంది. శిక్షణలో మూడో దశను కూ డా పూర్తి చేద్దామనుకుంటున్నాను’ అ న్నారు. ‘భారత నౌకాదళంలో మహిళలు ఉన్నారు. అయితే వాళ్లు కాక్‌పిట్‌లో లేరు. ఒక మహిళ కాక్‌పిట్‌లోకి రావడం ఇదే మొదటిసారి. రక్షణరంగంలో చేరాలనుకునే మహిళలకు ఇది మరింత అవకాశాన్నిస్తుంది’ అని నౌకాదళ మొదటి మహిళా పైలట్ వివరించారు.

Sub Lieutenant Shivangi becomes Navy first woman pilot

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నౌకాదళంలో తొలి మహిళా పైలట్ శివాంగి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.