సైబరాబాద్ ఎస్‌ఐ రాందాస్ జైలుపాలు

మనతెలంగాణ/షాపూర్‌నగర్ : చట్టాన్ని అమలు చేయాల్సిన ఓ పోలీసు అధికారి సెటిల్‌మెంట్‌కు పాల్పడటంతో కటకటాల పాలయ్యాడు. సైబరాబాద్ కమీష్‌నరేట్ పరిధిలో సివిల్ తగాదాల్లో తలదూర్చి ఓ వర్గానికి మద్దతుగా నిలిచి మరో వర్గానికి అన్యాయం చేసాడనే ఆరోపణలపై ఎస్సై రాందాస్ చర్లపల్లి జైలుపాలయ్యాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాలానగర్ జోన్ దుండిగల్ పోలీసుస్టేషన్‌లో 9నెలల నుంచి విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాందాస్ గతంలో మోయినాబాద్ పిఎస్‌లో విధులు నిర్వహించాడు. మోయినబాద్ పిఎస్‌లో పనిచేసే సమయంలో చిన్నమంగళారం గ్రామానికి చెందిన […] The post సైబరాబాద్ ఎస్‌ఐ రాందాస్ జైలుపాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/షాపూర్‌నగర్ : చట్టాన్ని అమలు చేయాల్సిన ఓ పోలీసు అధికారి సెటిల్‌మెంట్‌కు పాల్పడటంతో కటకటాల పాలయ్యాడు. సైబరాబాద్ కమీష్‌నరేట్ పరిధిలో సివిల్ తగాదాల్లో తలదూర్చి ఓ వర్గానికి మద్దతుగా నిలిచి మరో వర్గానికి అన్యాయం చేసాడనే ఆరోపణలపై ఎస్సై రాందాస్ చర్లపల్లి జైలుపాలయ్యాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాలానగర్ జోన్ దుండిగల్ పోలీసుస్టేషన్‌లో 9నెలల నుంచి విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాందాస్ గతంలో మోయినాబాద్ పిఎస్‌లో విధులు నిర్వహించాడు. మోయినబాద్ పిఎస్‌లో పనిచేసే సమయంలో చిన్నమంగళారం గ్రామానికి చెందిన ఓ ల్యాండ్ కేసులో బాధితులకు అండగా నిలవాల్సిన రాందాస్ కబ్జాదారులకు వత్తా సు పలికాడు. ఆ తరువాత కొద్దిరోజుల తరువాత అక్కడి నుంచి దుండిగల్ స్టేషన్‌కు బదిలీ అయినా రాందాస్‌ను చేసిన తప్పు మాత్రం విడిచిపెట్టలేదు.

మోయినాబాద్ భూబాధితుడు సురేష్ తమకు అన్యాయం జరిగిందని పాస్‌బుక్‌లు తమ వద్ద ఉన్నా భూకబ్జాదారులకు ఎస్సై వత్తాసు పలికారని రాందాస్ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో ఎస్సై పాత్రపై వచ్చిన అభియోగాలు నిజమేనని తేలడంతో ఎస్సైరాందాస్‌పై ఇటీవల మోయినాబాద్ పిఎస్‌లో బాధితుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు అయ్యింది.ఈమేరకు జైలుకు తరలించారని తెలిసింది.అయితే ఇటివలే దుండిగల్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించిన సిఐ సస్సెన్షన్‌కు గురికావడం మరువకముందే మరో ఎస్సై పాత కేసులో జైలుపాలు అవడం స్థ్దానికంగా సంచలనం రేపుతోంది.

The post సైబరాబాద్ ఎస్‌ఐ రాందాస్ జైలుపాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: