సీజన్ కు తగ్గ స్టైల్

  వాతావరణం చల్లగా ఉంటే ఎలాంటి దుస్తులైనా ఎంచుకోవచ్చు. స్వెటర్లు, జాకెట్స్‌తో మరింత ఫ్యాషన్‌గా కనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఎండలు అదరగొట్టడం మొదలు పెట్టాయి. కాబట్టి ఇలాంటి స్టయిల్ కుదరదు. సింపుల్‌గా, సౌకర్యవంతంగా ఉండే స్టయిల్స్ ఫాలో కావాలి. వైట్ ఈజ్ బెస్ట్: వేసవి వేడికి విరుగుడు తెలుపు రంగు దుస్తులు. తెలుపు టాప్‌తో ఏ రంగు బాటమ్‌నైనా మ్యాచ్ చేసేయవచ్చు. విభిన్నంగా, ఆధునికంగా కనిపించాలంటే వైట్ టాప్‌కు ముదురు రంగు ప్యాంట్ లేదా పలాజో ధరించాలి. […] The post సీజన్ కు తగ్గ స్టైల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాతావరణం చల్లగా ఉంటే ఎలాంటి దుస్తులైనా ఎంచుకోవచ్చు. స్వెటర్లు, జాకెట్స్‌తో మరింత ఫ్యాషన్‌గా కనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఎండలు అదరగొట్టడం మొదలు పెట్టాయి. కాబట్టి ఇలాంటి స్టయిల్ కుదరదు. సింపుల్‌గా, సౌకర్యవంతంగా ఉండే స్టయిల్స్ ఫాలో కావాలి.

వైట్ ఈజ్ బెస్ట్: వేసవి వేడికి విరుగుడు తెలుపు రంగు దుస్తులు. తెలుపు టాప్‌తో ఏ రంగు బాటమ్‌నైనా మ్యాచ్ చేసేయవచ్చు. విభిన్నంగా, ఆధునికంగా కనిపించాలంటే వైట్ టాప్‌కు ముదురు రంగు ప్యాంట్ లేదా పలాజో ధరించాలి. మ్యాచింగ్ హీల్స్ తప్పనిసరి.

ఫ్లవర్ పవర్ : పువ్వుల డిజైన్లకు సరైన సీజన్… సమ్మర్! కాబట్టి ఫ్లవర్ ప్రింట్లు ఉన్న డ్రస్‌లు ధరించండి. అయితే ఈ డ్రస్‌కు తగ్గట్టు భారీ జ్యువెలరీ ధరించకూడదు. సింపుల్‌గా ఉండే ఇయర్ హ్యాంగింగ్స్, పాదాలకు ఫ్లాట్స్ బాగుంటాయి.

ఇంటరెస్టింగ్ యాక్సెసరీస్: గ్రాఫిక్ డిజైన్లకు తగిన సీజన్ ఇది. షూ, ఇయర్ హ్యాంగింగ్స్, ఫ్యాన్సీ బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్… ఏది ఎంచుకున్నా సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. జీన్స్ ధరిస్తే, పెద్దసైజు హ్యాండ్ బ్యాగ్, స్కర్క్ ధరిస్తే, మినీ పర్స్…ఇలా డ్రస్‌తో యాక్సెసరీస్ మ్యాచ్ చేయాలి.

కూల్ స్కార్ఫ్: ఇప్పటివరకూ స్టోల్స్ వాడినా, ఇకపై వాటి అవసరం ఉండదు. ఎండ నుంచి తట్టుకోవడం కోసం, అదే సమయంలో ఫ్యాషన్‌గా కనిపించడం కోసం స్కార్ఫ్‌లను తలకు చుట్టుకోవాలి. అయితే స్కార్ఫ్ పలుచని మెటీరియల్‌తో తయారయినదై ఉండాలి. వీటన్నింటితోపాటు సన్‌గ్లాసెస్ వాడితే కళ్లకు రక్షణగా ఉంటుంది.

Styles in different Season

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సీజన్ కు తగ్గ స్టైల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: