పోలీస్ వాహనంపై స్టంట్.. టిక్ టాక్ లో వైరల్

Tik Tok

 

ఢిల్లీ: సోషల్ మీడియాతో పోలిస్తే ఇండియాలో టిక్‌టాక్ ఫేమస్ అయింది. కుర్రాళ్లు వింత వింత ప్రయోగాలు చేసి వీడియోలు తీసి టిక్ టాక్‌లో షేర్ చేస్తున్నారు. టిక్‌టాక్ వీడియోలతో ప్రాణాలు మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో పోలీస్ కారు నడుస్తుండగా ఓ యువకుడు వాహనం పైకి ఎక్కి పుషప్‌లు తీశాడు. పోలీసులు వాహనాన్ని రన్నింగ్‌లో ఉంచిన అనంతరం దానిపైకి ఎక్కి పుషప్‌లు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఢిల్లీ పోలీసులకు షేర్ చేశారు. దీంతో ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేస్తామని రిప్లై ఇచ్చారు. ఈ కేసు ఎంతవరకు వచ్చిందని ఢిల్లీ పోలీసులను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇండియాలో టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలని రెనవికర్ అనే నెటిజన్ కోరుతున్నాడు. టిక్‌టాక్ సమయంతో పాటు జీవితం కూడా వృధా అవుతోందని, సదరు ఇడియట్స్ ఛీప్‌గా పబ్లిసిటీ చేసుకున్నాడని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Courtesy by Republic World

 

 

 

Stunt on Police Vehicle in Tik Tok Video

The post పోలీస్ వాహనంపై స్టంట్.. టిక్ టాక్ లో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.