‘సహచరులతో అద్భుతమైన రోజు’: విరాట్ కోహ్లీ

 

అంటిగ్వా: వెస్టీండీస్ పర్యటనలో టీమిండియా జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక, టెస్టు సిరీస్ లో భాగంగా గురువారం నుంచి విండీస్ జట్టుతో టీమిండియా తొలి టెస్టును ఆడనుంది. ఈ మ్యాచ్ తో ఇరుజట్లూ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ను ప్రారంభించనున్నాయి. కాగా, వన్డే, టెస్టు సిరీస్ ల మధ్యలో కొంత సమయం దొరకడంతో టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా కొంతమంది ఆటగాళ్లు, స్టాఫ్ అంతాకలిసి.. నార్త్ సౌండ్ లోని జాలీ బీచ్లో సేదతీరారు. ఈ సందర్భంగా అందరూ ఫోటోకు ఫోజిచ్చారు. దీనిని విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘బీచ్లో సహచరులతో అద్భుతమైన రోజు’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

‘Stunning day at the beach with the boys’: Virat Kohli

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘సహచరులతో అద్భుతమైన రోజు’: విరాట్ కోహ్లీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.