కూటి కోసం కోటి తిప్పలు..!

  ఎంపీడీఓ కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా కెజిబివి పాఠశాల ప్రిన్సిపాల్ మాకొద్దంటు నినాదాలు పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, డీఈఓ రాయికోడ్ : హాస్టళ్లలో బుద్దిగా చదువుకొని ఏదైనా ఉద్దరి స్తారనే ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులు కోటి ఆశలతో ఉంటే పాఠశాల సిబ్బంది నిర్లక్షంతో ప్రభుత్వం అందజేస్తున్న అన్నం కూడాసరిగ్గా పెటకపోవడంతో విద్యార్థులు ఉపవాసాలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయికోడ్ మండల కేంద్రంలో కెజిబిపి పాఠశాల ప్రిన్సిపాల్ పెడుతున్న ఇబ్బందులకు ఎన్ని రోజులు పస్తులు ఉండాలి.. ఎంత […] The post కూటి కోసం కోటి తిప్పలు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎంపీడీఓ కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా
కెజిబివి పాఠశాల ప్రిన్సిపాల్ మాకొద్దంటు నినాదాలు
పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, డీఈఓ

రాయికోడ్ : హాస్టళ్లలో బుద్దిగా చదువుకొని ఏదైనా ఉద్దరి స్తారనే ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులు కోటి ఆశలతో ఉంటే పాఠశాల సిబ్బంది నిర్లక్షంతో ప్రభుత్వం అందజేస్తున్న అన్నం కూడాసరిగ్గా పెటకపోవడంతో విద్యార్థులు ఉపవాసాలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయికోడ్ మండల కేంద్రంలో కెజిబిపి పాఠశాల ప్రిన్సిపాల్ పెడుతున్న ఇబ్బందులకు ఎన్ని రోజులు పస్తులు ఉండాలి.. ఎంత వరకు ఈతతంగం జరుగుతుంది… మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని కెజిబివి పాఠశాల విద్యార్థులు ఆలోచించి శనివారం ఏకంగా రోడ్డెక్కి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

పాఠశాల ప్రిన్సిపల్ మాకొద్దంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హుటాహుటినా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇదేం చారు.. నీళ్లు.. కారం తప్ప పప్పులో ఏమి లేదని, ఇలా అయితే విద్యార్థులు ఎలా తింటారని పాఠశాల ప్రిన్సిపల్ అర్చనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేస్తున్న విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే పాఠశాల ప్రిన్సిపల్ అర్చనను తొలగిస్తేనే తాము పాఠశాలకు వస్తామని, అప్పటి వరకు పాఠశాలకు రామని, ఇక్కడనే ఉంటామని, ప్రిన్సిపల్ పెట్టే బాధలకు ఇబ్బందులు పడుతున్నామని విద్యార్ధులు కంట తడితో ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రిన్సిపల్ అర్చనను తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని విద్యార్ధులకు హామీనిచ్చారు. వెంటనే సంగారెడ్డి జిల్లా విద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడి వెంటనే కెజిబివిపి పాఠశాల ప్రిన్సిపల్ (ఎస్‌ఓ)పై చర్యలు తీసుకొని తొలగించాలని ఆదేశించారు. కాగా విద్యార్ధులకు ఎమ్మెల్యే హామీనివ్వడంతో కెజిబివికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే, డీఈఓలు విద్యార్ధులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాగా పాధ్యాయులతో కూడా సమస్యలపై ఆరాతీశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వెంకట్రావు, జడ్‌పీటీసీ మల్లికార్జున్ పాటిల్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏసయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Students Protest in front of MPDO office

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కూటి కోసం కోటి తిప్పలు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: