ఆశ్రమ పాఠశాల నుండి పారిపోతున్న విద్యార్థులు

Students fleeing from the Ashram school
ఆదిలాబాద్: ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల ఎన్నో చర్యలు తీసుకున్న విషయం లిఖితమే గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని నాణ్యమైన విద్యతో పాటు ఆహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరైన రక్షణ లేక విద్యార్థులు పాఠశాలల నుండి పారిపోతున్న సంబంధిత గిరిజన శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణాలు ఉన్నాయి. ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారిని అనుకొని ఉన్న గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థులకు భద్రత కరువైంది. సెప్టెంబర్ 09న జరిగే పోలాల అమవాస్య పండగను ఇంటి వద్దనే జరుపుకోవడానికి గిరిజన విద్యార్థులు పథకంపన్ని పాఠశాల నుండి చాకచాక్యంగా తప్పించుకొని పారిపోయారు. పాఠశాలలో చదువుతున్న 11 మంద విద్యార్థులు అయిన అత్రం గణేష్, సునిల్, దేవరావు, నితిన్, అత్రం రవి, సంతోష్, లక్ష్మణ్, రాజేందర్‌లు వారివారి గ్రామాలకు పొలాల అమవాస్య పండగ కోసం వెళ్లడానికి శుక్రవారం వేకువజామున 3 గంటలకు తోటి విద్యార్తులు నిద్రిస్తుండగానే ఆశ్రమ పాఠశాల వెనుక నుండి తప్పించుకొని ఖానాపూర్ బస్టాండ్‌కు చేరుకున్నారు.

వీరి మాదిరిగానే గురువారం సైతం సలుగురు విద్యార్థులు పారిపోగా వారి గురించి పాఠశాల వార్డెన్, ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో మళ్ళి 11 మంది విద్యార్థులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పాఠశాలలో తెల్లవారు జామున 3గంటలకే నిద్ర నుండి లేచి చేతికి అందిన బట్టలను సదురుకొని కిలో మీటర్ దూరంలో ఉన్న బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్‌లో ఉన్న హోటర్ యాజమానులు, ప్రైవేట్ వాహనాల యాజమానులు పిల్లలను చూసి వారిని ఆరా తీయగా తాము పొలాల అమవాస్యకు ఇంటికి వెళ్తున్నామని చెప్పగా ఇంత ప్రోద్దున ఎలా వచ్చారని ఆరా తీశారు. తాము తప్పించుకొని వచ్చామని ఒకరిద్దరూ తెలుపగా ఆశ్రమ పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయుల పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాత్రిలో పిల్లలకు ఎమైన జరిగితే ఎవరూ బాధ్యులు అన్నారు. విషయాన్ని సిఐ ఆకుల ఆశోక్‌ వివరించగా వెంటనే పోలీసులను బస్టాండ్‌కు పంపించి విద్యార్థులను పట్టుకొని తిరిగి పాఠశాలకు వారిని తరలించారు. పిల్లల భద్రతలో నిర్లక్షం ఎందుకు చేశారని సిబ్బంది, ప్రధానోపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు.

Comments

comments