అమెరికాలో కాల్పులు : విద్యార్థి మృతి

అమెరికా : కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లోని ఓ పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఇద్దరు దుండగులు విద్యార్థులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు దుండగులు ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు పాల్పడింది తోటి విద్యార్థులే అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులను పోలీసులు […] The post అమెరికాలో కాల్పులు : విద్యార్థి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమెరికా : కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లోని ఓ పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఇద్దరు దుండగులు విద్యార్థులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు దుండగులు ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు పాల్పడింది తోటి విద్యార్థులే అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అమెురికాలో తుపాకీ సంస్కృతి మరింతగా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఓ యూనిర్సిటీలో దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వెస్ట్ బాల్టిమోర్, శాండియోగోలో సైతం దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పది మందికి పైగా చనిపోయారు. తుపాకీ సంస్కృతిని నివారించేందుకు కఠిన చట్టాలను రూపొందించాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు.

Student Shot Dead in America by Unknown Persons

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమెరికాలో కాల్పులు : విద్యార్థి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: