మంచి నడవడి అలవడేది విద్యార్థిదశలోనే : చినజీయర్

  నారాయణపేట : సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు, మంచి విలువలు, మంచి నడివడి నేర్పించేందుకు విద్యార్ధి దశ ముఖ్యమైనదని, దీని కొరకు అందరు ఉపాధ్యాయులు కృషి చేయాలని చినజీయర్‌స్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ వద్దనున్న చిన్నజీయర్‌స్వామి ఆశ్రమంలో వికాసతరంగిణి ద్వారా నిర్వహించిన వ్యాసరచన (అంశం–..భారతమాత పిలుస్తోంది నాప్రతిస్పందన), చిత్రలేఖనం (నీటి చుక్క విలువ 2030) పోటీలలో గెలుపొందిన నారాయణపేట జిల్లా విద్యార్థులకు చినజీయర్‌స్వామి, పేట కలెక్టర్ ఎస్.వెంకట్రావ్‌లు బహుమతులను అందజేశారు. ఈసందర్భంగా స్వామి మాట్లాడుతూ […] The post మంచి నడవడి అలవడేది విద్యార్థిదశలోనే : చినజీయర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నారాయణపేట : సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు, మంచి విలువలు, మంచి నడివడి నేర్పించేందుకు విద్యార్ధి దశ ముఖ్యమైనదని, దీని కొరకు అందరు ఉపాధ్యాయులు కృషి చేయాలని చినజీయర్‌స్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ వద్దనున్న చిన్నజీయర్‌స్వామి ఆశ్రమంలో వికాసతరంగిణి ద్వారా నిర్వహించిన వ్యాసరచన (అంశం–..భారతమాత పిలుస్తోంది నాప్రతిస్పందన), చిత్రలేఖనం (నీటి చుక్క విలువ 2030) పోటీలలో గెలుపొందిన నారాయణపేట జిల్లా విద్యార్థులకు చినజీయర్‌స్వామి, పేట కలెక్టర్ ఎస్.వెంకట్రావ్‌లు బహుమతులను అందజేశారు.

ఈసందర్భంగా స్వామి మాట్లాడుతూ విద్యార్థులలో జాగృతికై వికాస తరంగిణి ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే నారాయణపేటలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పోటీలను నిర్వహించటం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రవీందర్, కలెక్టర్ సిసి నారాయణరావు, యాదయ్యశెట్టి తదితరులు ఉన్నారు.

Student phase is important for Teaching good values

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మంచి నడవడి అలవడేది విద్యార్థిదశలోనే : చినజీయర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.