ఇంజినీరింగ్ విద్యార్థిని నగ్న వీడియో షేర్…ఇద్దరు అరెస్టు

Student naked video share in social media

అమరావతి: ఇంజినీరింగ్ విద్యార్థిని నగ్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తెనాలి, గుంటూరు చెందిన ఇద్దరు విద్యార్థులు, బాధితురాలితో కలిసి ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలను తెనాలి యువకుడు మై నేమ్ ఈజ్ 420 ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. గుంటూరు చెందిన యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పోలీసులు ఐపి అడ్రస్ ద్వారా వారిని గుర్తించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకుడిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.

The post ఇంజినీరింగ్ విద్యార్థిని నగ్న వీడియో షేర్… ఇద్దరు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.