విద్యుత్ షాక్‌కు విద్యార్థి మృతి

Student-Dies

మన తెలంగాణ/నిజామాబాద్‌క్రైం: చదువుతున్న పాఠశాలలో విద్యుత్‌షాక్‌కు గురై ఐదో తరగతి విద్యార్ధి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కోటగల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆసబ్‌నగర్‌కు చెందిన అయ్యన్‌ఖాన్ 5వ తరగతి చదువుతున్నాడు. అయ్యన్‌ఖాన్ మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్ తీగకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డిఈఓ, 1వ టౌన్ ఎస్‌హెచ్‌ఓ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను నచ్చచెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
విచారణకు కలెక్టర్ ఆదేశం..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అయ్యన్‌ఖాన్ మృతి చెందిన సంఘటనపై తగిన విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు రెవెన్యూ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లను ఆదేశించారు.

student dies of electric shock at nizamabad

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యుత్ షాక్‌కు విద్యార్థి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.