హెచ్.సి.యు లో విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి…

  గచ్చిబౌలి : అనుమాస్పద స్థితిలో ఓ విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో హాస్టల్‌లోని బాత్రూంలో మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖరగ్సూర్ నగరానికి చెందిన దీపిక మహాప్రాత (29) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో పీహెచ్‌డి చదువుతోంది. ఈ విద్యార్థిని సోమవారం నాడు ఉదయం 8 గంటల ప్రాంతంలో బాత్రూములో అనుమానస్పద స్థితిలో పడి ఉంది. తోటి విద్యార్థులు చూసి […] The post హెచ్.సి.యు లో విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గచ్చిబౌలి : అనుమాస్పద స్థితిలో ఓ విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో హాస్టల్‌లోని బాత్రూంలో మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖరగ్సూర్ నగరానికి చెందిన దీపిక మహాప్రాత (29) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో పీహెచ్‌డి చదువుతోంది. ఈ విద్యార్థిని సోమవారం నాడు ఉదయం 8 గంటల ప్రాంతంలో బాత్రూములో అనుమానస్పద స్థితిలో పడి ఉంది.

తోటి విద్యార్థులు చూసి వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అదించారు. కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని ఆ విద్యార్థినిని స్థానిక ఓ ప్రైవేటు హాస్పిటల్ తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని హాస్పిటల్ వర్గాలు నిర్ధారించారు.

అయితే పోలీసులు అప్పటికే ఆమె మెడికల్ రికార్డులు, పరిశీలించి ఆమెకి మెదడుకు సంభందించిన కొన్ని వ్యాదులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాధుల వలన ఆమె కళ్ళు తిరిగి పోయి బాత్రూంలో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Student dies in suspicious condition at HCU

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హెచ్.సి.యు లో విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: