నాగసానిపల్లిలో వర్షభీభత్సం..

mahabub-nagar

l 4 మూగజీవాలు మృతి..
l 7 విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో
దాదాపు 20గ్రామాల్లో..
విద్యుత్ సరఫరాకు అంతరాయం..

మన తెలంగాణ/శ్రీరంగాపురం : మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో గాలి, వర్షభీభత్సంతో విద్యుత్ స్తంబాలు నేలకూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్గింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పశువుల పాకలు,గుడిసెలు, విద్యుత్‌స్తంబాలు నేలకొర గడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రేకుల షెడ్లు గాలి  వానకు కొట్టుకొనిపోయాయి. పశువుల పాక లు కూలిపోవడంతో 4మూగజీ వాలు మృతి చెందాయి. పశుగ్రాసం, విద్యుత్ స్తంబాలు కూలి పోవడంతో 50మంది రైతులకు నష్టంవాటిల్లినట్లు రెవెన్యూ శాఖాధి కారులు విఆర్‌ఒ వెంకట్మ్రణ గ్రామంలో నష్టాన్ని అంచనా వేస్తు న్నారు. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలని స ర్పంచ్ సుజాత ఈశ్వరయ్య, రవి తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.

        బుధవారం రాత్రి జరిగిన వర్షభీభత్సానికి విద్యుత్‌స్తంబాలు నేలకొరి గాయి. వాటిని మరమ్మత్తు చేసి గ్రామాలకు విద్యుత్‌ను సరఫరా చే స్తాం. వీచి న గాలికి విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. నాగసానిపల్లి గ్రామంలో 3 విద్యుత్ స్తంబాలు, పాతపల్లి లో 2, గుమ్మడంలో చెట్లు  విరిగిపోయి విద్యుత్ స్తంబాలపై పడి విద్యుత్ వైర్లు తెగిపోవడంతో  విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి.  విద్యుత్ సరఫరా కోసం తక్షణమే తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎఈ ప్రదీప్‌గౌడ్ తెలిపారు.