జమాబందీకి కొత్తరూపు?

కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ తరహాలో జమాబందీ వ్యవస్థలో సంస్కరణలు పకడ్బందీగా రెవెన్యూ చట్టం మరింత పారదర్శకంగా ధరణి మన తెలంగాణ/హైదరాబాద్: జమాబందీ కొత్త రూపు సంతరించకోనుంది. వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త చట్టం లో కఠిన నిబంధనలను పొందు పరిచినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న నిబంధనల తొలగించి భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు పట్టణ భూములకు ప్రత్యామ్నాయ చట్టాన్ని రూపొందించేలా ప్రభుత్వం ప్ర ణాళికలు రూపొందిస్తున్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. […] The post జమాబందీకి కొత్తరూపు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ తరహాలో జమాబందీ వ్యవస్థలో సంస్కరణలు
పకడ్బందీగా రెవెన్యూ చట్టం
మరింత పారదర్శకంగా ధరణి

మన తెలంగాణ/హైదరాబాద్: జమాబందీ కొత్త రూపు సంతరించకోనుంది. వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త చట్టం లో కఠిన నిబంధనలను పొందు పరిచినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న నిబంధనల తొలగించి భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు పట్టణ భూములకు ప్రత్యామ్నాయ చట్టాన్ని రూపొందించేలా ప్రభుత్వం ప్ర ణాళికలు రూపొందిస్తున్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రెవె న్యూ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని పారదర్శకంగా, అవినీతి రహితంగా రూపొం దించాలని నిర్ణయించింది. కంక్లూజివ్ టైటిట్ యాక్ట్ తరహాలోనే రాష్ట్రంలో జమాబందీ వ్యవస్థలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో గాడితప్పిన జమాబందీ తో భూ ఆక్రమణలు పెరిగాయన్న వివిధ కమిటీల నివేదికల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చట్టానికి పదును పెడుతోంది. తా జాగా రెవెన్యూ శాఖ సంస్కరణ, కొత్త చట్టం, విలీనం వంటి చర్యల నేపథ్యంలో పకడ్బందీ చర్యలను అవలంభించాలన్న లక్షంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
1990 వరకు రాష్ట్రంలో గ్రామస్థాయి యూనిట్‌గా తీసుకొని ఈ నేపథ్యంలో ఆ ర్‌ఓఆర్ చట్టం తరహాలోనే పట్టణ ప్రాంత భూములకు కొత్త చట్టంలో ప్రత్యేక నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి వేర్వేరుగా ప్రత్యేక చట్టం తెచ్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. గతంలో అనేక నివేదికల్లో 1990కి ముందున్న పరిస్థితులను ఇప్పటి పరిస్థితులను సమగ్రంగా విశ్లేషిస్తూ వివిధ కమిటీలు ప్రభుత్వానికి నివేదించాయి. భూ ఆక్రమాలకు దారితీసిన ప్రధాన కారణాలను తెలుసుకొని కొత్త చట్టంలో కట్టుదిట్టంగా వ్యవహారించాలని ఆ నివేదికల్లో పొందుపరిచారు. 1990 వరకు రాష్ట్రంలో గ్రామస్థాయి యూనిట్‌గా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ రికార్డుల తనిఖీ కొనసాగడం రివాజుగా ఉండేది. ఆ తరువాత ఈ వ్యవహారం పూర్తిగా కనుమరుగు కావడంతో అక్రమాలకు కలిగినట్టు గుర్తించారు. అయితే 1989లో ఆంధ్రప్రదేశ్ భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, 1971ను అమల్లోకి తీసుకురావడంతో జమాబందీ ప్రక్రియకు స్వస్తి పలికారు. ఈ చట్టం రాకముందు తహసీల్దార్ మొదలు సిసిఎల్‌ఏ (భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్) వరకు తనిఖీలు జరిపేవారు. భూ వ్యవహారాలు, రికార్డుల వరకు అన్నీ పకడ్భందీగా జరిగేవి. చిన్నపాటి భూ కమతాలు కూడా ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పర్యవేక్షించే వీలు ఉండేది. కానీ ఈ చట్టం తరువాత వీటిని పక్కకు పెట్టడంతో అక్రమాలకు అవకాశం ఏర్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోర్ బ్యాంకింగ్ తరహాలో ప్రత్యేక ల్యాండ్ వెబ్‌సైట్ ధరణి వెబ్‌సైట్‌ను మరింత పారదర్శకంగా తీసుకురానున్నారు. దీనిని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.
అమల్లోకి రానున్న నూతన రిజిస్ట్రేషన్ విధానం
అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన నూతన రిజిస్ట్రేషన్ విధానం నాటి నుంచి దీనిని అమల్లోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇది రెవెన్యూ శాఖ పరిధిలోనా లేక శాఖల విలీనం తరువాత మారుతుందా అనే అంశంపై ప్రభుత్వం సీనియర్ అధికారులతో చర్చిస్తోంది. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏకకాలంలో ఒకే కార్యాలయంలో జరిగేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రతి ఎకరం వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తున్నారు. మొత్తం తెలంగాణ భూభాగం ప్రతి అంగుళం ఇందులో నిక్షిప్తం అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్రయ, విక్రయాలు, యాజమాన్య మార్పులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సిఎం ఆదేశాలు అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం ఒక ఐటి నిపుణుడిని ప్రతి మండల కార్యాలయంలో నియమించారు. త్వరలో మండల కార్యాలయాలను మొదలుకొని రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్లా ఈ వెబ్‌సైట్ నుంచే ఎవరైనా కావాల్సిన వివరాలు పొందవచ్చు. విదేశాల్లో ఉన్న ఎన్నారైలు కూడా ధరణి ద్వారా క్రయ, విక్రయాలు జరుపుకునే వీలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో పలు అంశాలను పొందుపరిచేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Strict regulations in New Revenue Act

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జమాబందీకి కొత్తరూపు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.