ఆధునిక సౌకర్యాలతో పోలీసు వ్యవస్థ పటిష్టం…

  శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బిచ్కుంద: ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఆధునిక సౌకర్యాలతో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలకు 24గంటల శాంతిభద్రతలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్యఉద్దేశమని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రె డ్డి అన్నారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని సుమారు 30 లక్షల నిర్మాణ వ్యయంతో నూతన ంగా నిర్మించిన పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయా న్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో శాసనసభాపతితో పాటు స్థానిక […] The post ఆధునిక సౌకర్యాలతో పోలీసు వ్యవస్థ పటిష్టం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బిచ్కుంద: ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఆధునిక సౌకర్యాలతో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలకు 24గంటల శాంతిభద్రతలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్యఉద్దేశమని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రె డ్డి అన్నారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని సుమారు 30 లక్షల నిర్మాణ వ్యయంతో నూతన ంగా నిర్మించిన పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయా న్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో శాసనసభాపతితో పాటు స్థానిక జుక్కల్ నియోజకవర్గ ఎంఎల్‌ఎ, ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండేతో పాటు కామారెడ్డి జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ప్రజలకు శాం తిభద్రతల దృష్టిలో ఉంచుకొని పోలీసు వ్యవస్థకు అన్ని విధాలా సౌకర్యాల కల్పనతో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసినట్లు ప్రజల రక్షణకి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్రజాసంక్షేమంలో రెండు కళ్లుగా భావించే అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాంగా చేసుకొని తమ ప్రభు త్వం ముందుకు సాగుతోందని ప్రజలకు ఎలాంటి లో టు లేకుండా అసౌకర్యాలకు గురికాకుండా ఉండేందు కు అన్ని విధాలా సంక్షేమ పథకాలను చేపట్టడంతో పా టు పోలీసు వ్యవస్థలో నూటికి నూరు శాతం మార్పులను తీసుకురావడంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు మరియు అధునాతన వాహనాల ద్వారా సేవలందించడం సిబ్బంది నియామకంలోనూ అవసరం దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో సిబ్బందిని నియామకాలు చేపట్టడం జరిగిందని ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా తమకు ఏవైనా సమస్యలు వచ్చిన సత్వరం పరిష్కారం కోసం అదైర్యపడకుండా అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల నిర్వహణలు ప్రముఖ పాత్ర ప్రజలదేనని ప్రజల సహకారం ఉంటేనే తాము మెరుగైన సేవలను అందించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు తమ భాగస్వామ్యంతో ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదంతో స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ముందుకు వస్తే దొంగతనాల నివారణ పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు శాంతిభద్రతలలో ప్రముఖ పాత్ర పోషించే విధంగా నేరప్రవృత్తి సైతం తగ్గిస్తామన్నారు. ప్రజలు చైతన్యంతో ముందుకు వచ్చి నూతన పాలకవర్గాలు అయిన సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసిలు ప్రజల సహకారంతో తమకు చేయూనివ్వాలని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ ,ఇండే మాట్లాడుతూ వెనుకబడిన జుక్కల్ ప్రాంతాన్ని ముందు ప్రాంతంలో నడిపించేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తున్నానని, సౌకర్యాలు తాను ప్రత్యేక చొరవతో పై స్థాయి అధికారులు మరియు ప్రజాప్రతినిధుల సహకారంతోనే నియోజకవర్గంలో పలు సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నానన్నారు. అనంతరం సర్కిల్ కార్యాలయం పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపిపి లలిత అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజులతో పాటు డిఎస్పీ యాదగిరి, స్థానిక సిఐ నవీన్ కుమార్, ఆయా మండలాల ఎస్సైలు మరియు స్థానిక పోలీసు సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Strengthening Police system with modern Facilities

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆధునిక సౌకర్యాలతో పోలీసు వ్యవస్థ పటిష్టం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.